
బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 06న జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 సత్తా చాటిన కామనర్స్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లో 10 మంది సెలబ్రిటీలు కాగా, కామనర్స్ ఆరుగురు ఉన్నారు. కాగా బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు, ఫ్యాన్ పేజీలు, ఓటింగ్ కోసం రిక్వెస్ట్‌లు, క్యాంపెయినింగ్‌లు ఎక్స్ ట్రా జరుగుతూనే ఉంటాయి. అలాగే చాలా మంది కంటెస్టెంట్స్ బయట సొంతంగా పీఆర్ టీమ్స్ కూడా మెయింటైన్ చేస్తుంటాడు. ఇక సెలబ్రిటీలకు అయితే అభిమానులకు తోడు, ఇతర సెలబ్రిటీల మద్దతు కూడా లభిస్తుంది. ముఖ్యంగా నామినేషన్స్ ఓటింగ్ జరిగే సమయంలో ఈ సపోర్ట్ బాగా వర్కవుట్ అవుతుంది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 10లోని సెలబ్రిటీ కంటెస్టెంట్లకు వారి ఫ్రెండ్స్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా బిగ్ బాస్ 10 లో అడుగు పెట్టిన కొందరికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టిన వారిలో జబర్దస్త్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన జబర్దస్త్ ఫ్రెండ్స్ అయిన వీరిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు ఆది. అయితే వీరిద్దరితో పాటు హైపర్ ఆది మరొకరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు స్టార్ యాంకర్ వర్షిణీ. ఢీతో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లో కలిసి పనిచేశారు వర్షిణీ, హైపర్ ఆది. దీంతో వీరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీని చూసి, నిజ జీవితంలో కూడా వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోనున్నారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని, ఆన్-స్క్రీన్‌పై కనిపించేదంతా కేవలం షో కోసమేనని స్పష్టం చేశారు. ఆది కూడా ఈ రూమర్లపై స్పందిస్తూ తాము ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రతి సీజన్ లోనూ బిగ్ బాస్ కు స్పెషల్ గెస్టుగా ఆది వస్తుంటాడు. కంటెస్టెంట్స్ అందరి మీద పంచులు వేస్తుంటాడు. మరి ఈ సీజన్ లో ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, వర్షిణి లతో ఎలా మాట్లాడుతాడో చూడాలి. అంతే కాకుండా ఎవరికి సపోర్ట్ చేస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.