Headlines

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ


టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

టాలీవుడ్ డ్యాన్సర్స్‌ అసోసియేషన్ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రఘు మాస్టర్ అడ్హాక్ కమిటీకి, ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత కమిటీకి మధ్య విభేదాలు ముదిరాయి. ఈ వివాదం రాయదుర్గం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. రఘు మాస్టర్ ప్యానెల్ బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిందని సుమలత ఫిర్యాదు చేయగా, సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని రఘు మాస్టర్ ఆరోపించారు. ఫెడరేషన్ తమ కార్యవర్గాన్ని గుర్తించిందని, అందుకే బ్యాంకును ఆశ్రయించామని రఘు మాస్టర్ వివరించారు. బ్యాంకు అధికారులు కూడా తమ లేఖలను ఆమోదించారని ఆయన పేర్కొన్నారు. సుమలత వల్ల అసోసియేషన్ పరువు పోతోందని, త్వరలోనే అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు తాము చేపడతామని రఘు మాస్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 13న జనరల్ బాడీ సమావేశం ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *