Headlines

Chiranjeevi: ఓటీటీలో ఈ తెలుగు వెబ్ సిరీస్‌ ను చాలా బాగా ఎంజాయ్ చేశా: మెగాస్టార్ చిరంజీవి


ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ది కోర్ట్ వంటి వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ తెలుగు వెబ్ సిరీస్ ను చూసి అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆ సిరీస్ పై ప్రశంసలు కురిపించారు. సిరీస్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశానంటూ తప్పకుండా అందరూ చూడాలని కోరారు. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన వెబ్ సిరీస్ ఏదనుకుంటున్నారా? శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. కరెంట్, కుమారి 21 ఎఫ్, 18 పేజెస్ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్ ను నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (సెప్టెంబర్ 06) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సంగీతం నేపథ్యంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్ ను చూశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈ సిరీస్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.


‘అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్ చూశా. ఎంతగానో ఎంజాయ్ చేశా. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్, విజువల్స్, ఆత్మను తాకే సంగీతంతో బ్యూటీఫుల్లీ క్రాఫ్టెడ్ సిరీస్ ఇది. దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి నిజంగా ఒక అద్భుతమైన సంగీత ప్రపంచాన్ని సృష్టించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అక్షయ్, సుష్మితా శెట్టి, మధుబాల అద్భుతంగా నటించారు.
ఇలాంటి క్లాసిక్, హృదయానికి హత్తుకునే సిరీస్‌ను ప్రేక్షకులకు అందించినందుకు నా కూతురు సుస్మితా కొణిదెలను, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అని చిరు ట్వీట్ చేశారు.

చిరంజీవి ట్వీట్..

జగమే సంగీతం వెబ్ సిరీస్ లో మొత్తం ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తో పాటు మధుబాల, అక్షయ్, సుస్మితా శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

జగమే సంగీతం వెబ్ సిరీస్ ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *