ఎన్టీఆర్ డ్రాగన్‌లోకి బాలీవుడ్ బడా స్టార్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? భుజం సర్జరీతో ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న తారక్.. త్వరలోనే లొకేషన్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ గ్యాప్‌లోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులోకి ఇద్దరు ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? వార్ 2తో నిరాశ పడిన ఎన్టీఆర్.. డ్రాగన్‌తో ఏం చేయబోతున్నారు..? అసలింతకీ డ్రాగన్‌లో ఉన్న ఆ స్టార్స్ ఎవరు..? ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు.. 2 వారాల తర్వాత తారక్ మళ్ళీ సెట్స్‌లోకి రానున్నారు.. ఫిబ్రవరిలోపు షూట్, జూన్ 2027లో సినిమా వస్తుందని ప్రకటించారు నిర్మాత రవిశంకర్. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలొస్తున్నాయి.. RRR తర్వాత తెలుగు వైపు చూడని అలియా భట్ కూడా డ్రాగన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. డ్రాగన్‌లో అనిల్ కపూర్ కూడా ఉన్నారు.. ఇప్పుడు షాహిద్, అలియా నటించబోతున్నారని తెలుస్తుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తారక్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయం వృధా కాకుండా ప్రస్తుతం హీరో లేని ఇతర కీలకమైన ఎపిసోడ్స్‌ను చకచకా పూర్తి చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ రాగానే షూట్ మళ్లీ జోరందుకోనుంది. బాహుబలి, పుష్ప మాదిరి భారీ గ్యాప్ తీసుకోకుండా.. డ్రాగన్ రెండు భాగాలను ఒకేసారి షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. తారక్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జూన్ 11, 2027న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. నిజంగానే షాహిద్, అలియా ఎంట్రీ ఇస్తే మాత్రం డ్రాగన్ రేంజ్ మారిపోవడం ఖాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్.. పొంచి ఉన్న పెను ముప్పు
డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ పాయింట్లు కట్
గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి
వారెవ్వా.. ఇకపై కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే
Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?