Headlines

200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!


మహారాష్ట్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఐదు తరాల తర్వాత, గత 200 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఒక వంశంలో ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ వారు చేసుకున్న సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన లింబాజీ దహిఫలే వంశంలో గత ఐదు తరాలుగా అంటే సుమారు 200 ఏళ్లుగా కేవలం మగ సంతానం మాత్రమే పుడుతూ వచ్చింది. దీంతో తమ కుటుంబంలో ఎప్పుడైనా ఒక ఆడబిడ్డ పుడుతుందా అని ఆ కుటుంబం ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు లింబాజీ కుమారుడు రిషికేశ్ దహిఫలే, కోడలు కల్పన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. రెండు శతాబ్దాల తర్వాత తమ ఇంటికి ఆడపిల్ల రావడంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోతోంది. చిన్నారికి రాజకుమారిలా ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్న తల్లీబిడ్డల కోసం పూలతో అత్యంత సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. ఊరేగింపుగా డప్పులు, మేళ తాళాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య వారిని ఇంటికి స్వాగతించారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తాత లింబాజీ, నానమ్మ సురేఖ తమ ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాస్‌.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్‌.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో

స్పైడర్‌ మ్యాన్‌లా స్టంట్‌ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..

పగలు ఆర్‌ఎంపీ డాక్టర్‌.. రాత్రయితే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *