Headlines

Bigg Boss 10 Telugu : ఏందీ బ్రో ఇలా చేశావ్.. బిగ్ బాస్‏లోకి సీరియల్ హీరో.. చివరి నిమిషంలో ట్విస్ట్..


బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’. ఇప్పటివరకు 9 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. ఇక ఎప్పటిలాగే ప్రతి సీజన్‌కు ముందు అందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా కొత్త సీజన్ (బిగ్ బాస్ తెలుగు 10) గురించిన చర్చలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతుండడంతో ఇందులో ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలో టాప్ రేటింగ్ సీరియల్ ‘గుండెనిండా గుడిగంటలు’ హీరో బాలు (విష్ణుకాంత్) పేరు నెట్టింట వైరల్‌గా మారింది. ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో ‘బాలు’ పాత్ర ద్వారా విష్ణుకాంత్ మంచి ప్రజాదరణ పొందారు. ఈ సీరియల్ ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్‌లో బాలు పాత్రే అత్యంత కీలకం. అయితే, విష్ణుకాంత్ ఈ సీరియల్ నుంచి తప్పుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారని, అందుకే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు చూసి ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

బాలు లేకపోతే సీరియల్ చూడలేమని, ఆ పాత్ర స్థానంలో మరొకరిని చూడలేమని వేలాదిగా కామెంట్లు చేశారు. దీంతో తన గురించి వస్తున్న రూమర్స్ , అభిమానుల సందేహాలపై నటుడు విష్ణుకాంత్ స్వయంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ బాలు వెళ్తున్నాడనే ప్రచారం జరిగింది.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

కానీ సాయంత్రం బిగ్ బాస్ షో స్టార్ట్ కాబోతుండగా.. బాలు మాత్రం ప్రశాంతంగా సీరియల్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టాడు. ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న బిగ్ బాస్ సెట్స్ పరిసరాల్లో విష్ణుకాంత్ కనిపించారనే వార్తలు రావడంతో మరోసారి అనుమానాలు రేకెత్తాయి. అయితే, ఇది కేవలం సందర్శన మాత్రమేనా లేక బిగ్ బాస్ టీమ్‌తో చర్చల కోసమా అనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే బాలు హౌస్ లోకి వెళ్లడం లేదని.. కేవలం సీరియల్ షూటింగ్ కోసం మాత్రమే అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లారని అంటున్నారు ఫ్యాన్స్.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

విష్ణు బాలు..

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *