Headlines

అమెరికాలో 600,000 డాలర్ల మోసం కేసులో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!


వాషింగ్టన్ రాష్ట్రంలోని టాకోమాలో మంజిత్ సింగ్ బేడీ ‘ఏషియన్ గ్రోసరీ స్టోర్’ పేరుతో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘స్నాప్’ (SNAP) అనే ఆహార సహాయ పథకం కింద అనుమతి పొందింది. అయితే, మార్చి 2024 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో బేడీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశాడు. ప్రభుత్వ సాయం అందుకునే పేద ప్రజలకు ఆహార పదార్థాలు ఇవ్వకుండా, వారి ఈబీటీ (EBT) కార్డులను స్వైప్ చేసి నేరుగా క్యాష్ ఇచ్చేవాడు.

ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో మంజిత్ సింగ్ బేడీ

ఆ మొత్తంలో సగం డబ్బును కమిషన్ గా తన వద్దే ఉంచుకుని భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ అక్రమాల ద్వారా బేడీ అమెరికా ప్రభుత్వాన్ని కనీసం 6 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.5 కోట్లు) మేర మోసం చేసినట్లు ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఆయనపై వైర్ ఫ్రాడ్, ఎస్‌ఎన్‌ఏపీ బెనిఫిట్స్ ఫ్రాడ్ కింద కేసులు నమోదు చేశారు.

అభియోగాలు నమోదైన తర్వాత బెడీని అరెస్టు చేయకుండానే కోర్టుకు హాజరు కావడానికి అనుమతించారు. కోర్టు విచారణ సమయంలో తన పాస్‌పోర్టును అప్పగించాలని, వాషింగ్టన్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించినప్పటికీ బేడీ ఆ నిబంధనలను ఉల్లంఘించాడు. రోడ్డు మార్గం ద్వారా కెనడా సరిహద్దు దాటి, అక్కడి నుంచి భారత్‌కు పారిపోయినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది.

భారత్‌కు వచ్చిన తర్వాత బేడీ పంజాబ్ లో అక్రమ ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలతో జలంధర్ కమిషనరేట్ పోలీసులు పరగ్‌పూర్ ప్రాంతంలో తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. బేడీపై స్థానికంగా కూడా మోసం, నమ్మకద్రోహం కేసులు ఉన్నాయి. ప్రస్తుతం బేడీ పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. త్వరలో అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ ప్రారంభించనున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తలు చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *