భారత మహిళల క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. మహిళల టీ20 ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఇప్పుడు ఆమె సొంతమైంది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 10,868 పరుగులు చేయగా, స్మృతి తన 303వ ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయిని దాటేసి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం స్మృతి 10,880 పరుగులతో మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి క్రీడాకారిణిగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మృతి ఖాతాలో మరో ఘనత చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. లానింగ్ 17 సెంచరీలతో ఇన్నాళ్లూ టాప్‌లో ఉండగా, హాంకాంగ్‌పై సెంచరీతో స్మృతి 18 సెంచరీలకు చేరుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఒకే మ్యాచ్‌లో రెండు దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్.. పొంచి ఉన్న పెను ముప్పు
డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ పాయింట్లు కట్
గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి
వారెవ్వా.. ఇకపై కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే
Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?