Headlines

I’m Game Review: సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..! హిట్టా..? ఫట్టా..?


వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ‘ఐమ్ గేమ్’ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. విత్ అవుట్ స్పాయిలర్ సింపుల్‌గా ఐమాయ్‌ గేమ్‌ కథేంటంటే.. లైఫ్‌ని ఎంజాయ్‌ చేయడానికి.. గ్యాంబ్లింగ్‌ ఆడడానికి మాత్రమే జీవితం ఉన్నదన్నట్టుగా ఫీలవుతుంటాడు గేమ్ డాన్ జాన్ అలియాస్ దుల్కర్‌. గ్యాంబ్లింగ్‌తో పాటే క్రికెట్ బెట్టింగ్‌కు బానిసవుతుంటాడు. గ్యాంబ్లింగ్ అంటే లక్‌ కాదు.. ఇట్స్‌ ఏ ప్యూర్ అల్గారిథమ్ అని బిలీవ్ చేస్తుంటాడు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న జాన్‌కు ఉన్నట్టుండి తన తండ్రి బిజినెస్‌ చూసుకోవాల్సి వస్తుంది. ఈ న్యూ రోల్లో జాన్ ఫిట్ అయ్యేందుకు తెగ కష్టపడుతుంటాడు. ఈక్రమంలోనే ఓ యాక్సిడెంట్.. ఆ తర్వాత ఏం అయింది. గేమ్ డాన్ జాన్ లక్‌ ఎలా మారింది. క్రికెట్‌కు గేమ్ డాన్ జాన్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? హీరోకు విలన్ రోల్ చేసిన డేవిడ్ అలియాస్ మిస్కిన్ కు ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది ఈ సినిమా కథ ఐమాయ్ గేమ్.. లో ఉన్న కీ పాయింట్ కొత్తేమీ కాదనే చెప్పాలి. ఇంతకు ముందే నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో ఇదే కాన్పెప్ట్‌ తో తెరకెక్కింది. తమిళ్లో శివ కార్తికేషన్ మావీరన్ సినిమాలో కూడా ఇదే పాయింట్. అయితే డైరెక్టర్ నహాస్ మాత్రం ఈ పాయింట్‌కు గ్యాంబ్లింగ్‌ బ్రాక్‌ గ్రౌండ్‌ను ఎంచుకున్నాడు అంతే. ఇక ఏమాటకు ఆమాటే చెప్పాలంటే ఫస్టార్ చాలా బాగుంది. డైరెక్టర్ నహాస్ యాక్షన్ సీన్స్‌ను తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉంది. అందులోనూ హైదరాబాద్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చాలా డార్క్‌గా, సరికొత్త కోణంలో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్. పాన్ ఇండియా స్టార్‌డమ్ మీద వేసిన సెటైర్లు, ఇంగ్లీష్, మలయాళం, తెలుగు, తమిళ భాషల కలయికలో రాసిన డైలాగ్స్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. హీరో ఎలివేషన్స్ కూడా పెద్ద పెద్ద డైలాగులతో కాకుండా చాలా సైలెంట్‌గా వర్కౌట్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ .. ఇంటర్వెల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే ఆ తర్వాత వచ్చే సెకండాఫ్ లో ఫ్లాష్‌బ్యాక్ మొదలవగానే సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. విక్కీ పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్‌ బ్యాక్ చాలా సాగదీసినట్లు, రొటీన్‌గా అనిపిస్తుంది. మళ్లీ సినిమాలో ప్రజెంట్ సిట్యువేషన్‌లోకి వచ్చాక కూడా పాతకాలపు పగ, ప్రతీకారం ఫార్మాట్‌లోనే యాక్షన్ సీన్స్ వస్తుంటాయి. బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాల గురించి ఇచ్చిన సందేశం కూడా ఏదో బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుందే తప్ప, కథలో కలిసిపోలేదు. డైరెక్టర్‌గా చెప్పాలంటే.. ఒక అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్‌లా మొదలైన సినిమా కాస్తా.. చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోతుంది. ఇక్కడే కొంత కొందరు ఆడియన్స్‌ డిస్సపాయింట్ అవ్వొచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే.. దుల్కర్ ఎప్పట్లానే తన యాక్టింగ్‌తో తన క్యారెక్టర్‌కు ప్రాణం పోశాడు. ఇక ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ విక్కీ క్యారెక్టర్‌లో అతిథిగా కనిపించిన ఆంటోని వర్గీస్. తన యాక్టింగ్‌తో సినిమాకు మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. మిస్కిన్, కదిర్, కాయదు లోహర్ క్యారెక్టర్స్‌కు ఈ సినిమా స్టోరీలో పెద్దగా స్కోప్ లేకపోయినా.. తమ పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు. టెక్నికల్‌గా యాంగిల్లో చెప్పాలంటే.. ఐమ్ గేమ్ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో జేక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ‘ఎవరే నువ్వు’ అనే సాంగ్‌ విజువల్‌గా చాలా బాగా అనిపిస్తుంది. జిమ్షి ఖలీద్ కెమెరా పనితనం చాలా షార్ప్‌గా, సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. చమన్ చాకో ఎడిటింగ్ కూడా ఓవరాల్‌గా బాగుంది. అయితే దర్శకుడు నహాస్ హిదాయత్ తనకున్న మంచి కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డాడేమో అనిపిస్తుంది. అద్భుతమైన ఐడియాతో కథను మొదలుపెట్టిన డైరెక్టర్ నహాస్‌.. సెకండాఫ్‌లో మాత్రం పాత ఫార్ములాతోనే సేఫ్ గేమ్‌ ఆడడం ఒక రకంగా మైనస్. ఇక ఓవరాల్‌ గా చెప్పాలంటే.. ఐమ్ గేమ్.. సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mirzapur Review: మున్నా భయ్యా ఈజ్ బ్యాక్! హిట్టా..? ఫట్టా..?

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త

హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై..

ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్‌ రానా షాకింగ్ కామెంట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *