Headlines

Janmashtami: 9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏తో అద్భుతం.. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..


దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సామాన్యులు, సెలబ్రెటీస్ తమ ఇళ్లల్లో ఎంతో ఘనంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో కృష్ణాష్టమి సందర్భంగా తనకు తొమ్మిదేళ్ల వయసులో చేసిన భారతనాట్యం వీడియోను పంచుకుంది. అందులో తన నృత్యం, హావభావలను అద్భుతంగా ప్రదర్శిస్తూ ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు అందరి హృదయాలను దొచేస్తుంది. కేవలం 9 ఏళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంతో శ్రీకృష్ణుడి అల్లరి చేష్టలను వేదికపై చూపించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి మరెవరో కాదు. హీరోయిన్ శ్రీలీల. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. అలాగే తెలుగుతోపాటు తమిళంలోనూ అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. అటు మెడిసిన్ చదువుతూనే ఇటు సినీరంగంలోనూ సత్తా చాటుతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఇదిలా ఉంటే కృష్ణాష్టమి సందర్భంగా తన తల్లి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో తన డ్యాన్స్ వీడియోను షేర్ చేసిందని.. దీంతో ఆ వీడియోను తనకు తన ఇన్ స్టాలో షేర్ చేయాలనిపించిందని రాసుకచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ శ్రీలీల టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

శ్రీలీల డ్యాన్స్ వీడియో..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *