Headlines

27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!


445 Runs T20 Record: ఎట్టకేలకు పసికూనపై ప్రపంచ ఛాంపియన్ టీం తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు, రికార్డులు చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఏకంగా 445 పరుగులు నమైదవ్వడం గమనార్హం. నమీబియాలో జరుగుతోన్న ట్రై సిరీస్‌లోని ఈ అద్భుతం చోటు చేసుకుంది. సౌతాఫ్రికా, నమీబియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీం 11 పరుగులతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా టీం తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అనంతరం నమీబియా 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 217 పరుగులకే పరిమితమైంది. ఓ దశలో సౌతాఫ్రికా టీంకు చుక్కలు చూపించిన నమీబియా తొలిసారి ఓటమిపాలైంది. అయితే, ఈ రెండు జట్లు కలిపి 200 పరుగులను దాటాయి.

అత్యధిక స్కోరుతో రికార్డ్..

దక్షిణాఫ్రికా టీం 228 పరుగులు చేయగా, నమీబియా 217 పరుగులు చేసింది. మొత్తంగా రెండు జట్లు కలిపి 445 పరుగులకు చేరింది. దక్షిణాఫ్రికా, నమీబియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది.

సెంచరీతో చెలరేగిన లువాన్-డ్రే ప్రిటోరియస్..

దక్షిణాఫ్రికా తరపున లువాన్-డ్రే ప్రిటోరియస్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 53 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్, 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 69 బంతుల్లో 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సౌతాఫ్రికాను భయపెట్టిన నమీబియా..

అనంతరం 218 పరుగుల ఛేజింగ్‌లో నమీబియా అద్భుతంగా ఆకట్టుకుంది. లారెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్ తొలి వికెట్‌కు 65 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు. గాయంతో స్టీన్‌క్యాంప్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అది జట్టుకు ఓటమిలా మారింది. ఆ తర్వాత, జట్టులోని ఇతర బ్యాటర్స్ క్రీజులో నిలవలేకపోయారు. కానీ, ఈ మ్యాచ్ చివరి ఓవర్‌కు దారితీయడం గమనార్హం. చివరి ఓవర్‌లో గెలవడానికి నమీబియాకు 24 పరుగులు అవసరం కాగా, కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *