Headlines

వైకల్యాన్ని జయించి మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి..


పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఎలాంటి వైకల్యం ఏమీ చేయలేదని నిరూపించాడు 17 ఏళ్ల జె.సంతోష్‌. తమిళనాడుకు చెందిన సంతోష్‌ పుట్టుకతోనే 90 శాతం స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, సెరిబ్రల్ పాల్సీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నన్నాడు. అయినా పట్టుదలతో దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైన సంతోష్, రెండో ప్రయత్నంలో అర్హత సాధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాడు. గతేడాది తన తోటి విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌ సందర్శనకు వెళ్లినప్పుడు, అనారోగ్య కారణాల వల్ల సంతోష్ వెళ్లలేకపోయాడు. ఆనాటి నిరాశను పట్టుదలగా మార్చుకుని, ఇవాళ అదే సంస్థలో విద్యార్థిగా అడుగుపెట్టడం అతని అకుంఠిత దీక్షకు నిదర్శనం. “కలల మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు.. కానీ, సంకల్పం మిమ్మల్ని గమ్యానికి చేర్చగలదు” అంటూ ఐఐటీ మద్రాస్ సంతోష్ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా కొనియాడింది. ‘టీఎన్ వలంటీర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కోర్సు గురించి తెలుసుకున్న సంతోష్, తన శారీరక స్థితికి అనుకూలంగా ఇంటి నుంచే చదువుకునే ఈ అవకాశాన్ని ఎంచుకున్నాడు. ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ‘అందరికీ ఐఐటీ-ఎం’ ప్రత్యేక కార్యక్రమం అతనికి పెద్దపీట వేసింది. టీఎన్ వలంటీర్స్ సంస్థ సంతోష్‌కు ఏఐ శిక్షణతో పాటు మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజును కూడా భరిస్తోంది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది కండరాల బలహీనతకు దారితీసే జన్యుపరమైన సమస్య కాగా, సెరిబ్రల్ పాల్సీ శరీర కదలికలను ప్రభావితం చేసే నాడీ సంబంధిత రుగ్మత. ఇటువంటి ప్రాణాంతక, శారీరక సవాళ్లను ఎదుర్కొంటూ సంతోష్ సాధించిన ఈ అద్భుత విజయం ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *