Headlines

Tollywood : 400లకు పైగా సినిమాలు.. పంచ్ డైలాగ్స్‏తో అదరగొట్టిన కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ (లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి). వైవిధ్యమైన నటనతో, సహజసిద్ధమైన సంభాషణలతో ప్రేక్షకుల మనస్సులలో చెరగని ముద్ర వేసిన ఆయన, ఇటీవల తన భార్యతో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన షేర్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎల్. బి. శ్రీరామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నేదనూరు. ఆయన తండ్రి వేదపండితుడు మరియు రాష్ట్రపతి పురస్కార గ్రహీత. చిన్నతనం నుంచే నటనపై ఉన్న మక్కువతో డ్రామాలు, నాటకాల్లో నటించి మంచి రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ఆల్ ఇండియా రేడియోలో కూడా కొంతకాలం పనిచేశారు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, మొదట మాటల రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసి, పవర్ ఫుల్ , కామెడీ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చాలా బాగుంది’ చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో ఓ సామాన్య మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన కనబరిచిన నటన ప్రేక్షకులచేత కన్నీళ్లు పెట్టించింది. కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, సెంటిమెంట్ పాత్రలలో జీవించి నంది అవార్డులను కూడా అందుకున్నారు. తన కెరీర్‌లో మొత్తం 400కు పైగా సినిమాల్లో నటించి, నాలుగు నంది అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ, సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. స్వయంగా షార్ట్ ఫిలిమ్స్, నాటికలు నిర్మిస్తూ నేటి తరం ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక పరిపూర్ణమైన నటుడిగా, రచయితగా తెలుగు సినిమా చరిత్రలో ఎల్. బి. శ్రీరామ్ గారు ఎప్పటికీ నిలిచిపోతారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఎల్ బీ శ్రీరామ్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *