Headlines

Team India: రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్


Team India: శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో దేవదత్ పడిక్కల్ సృష్టించిన పరుగుల సునామీ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనలో సాయి సుదర్శన్ ఫిట్‌గా తిరిగొచ్చినా, నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్‌నే ఆడించాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన బ్యాటర్ దేవదత్ పడిక్కల్. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పడిక్కల్‌కు ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం లభించింది. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత పునరాగమనం చేసిన ఈ యంగ్ బ్యాటర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే 109.33 భారీ సగటుతో 328 పరుగులు సాధించారు. ఇందులో రెండు మెరుపు సెంచరీలు, 33 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

తన యూట్యూబ్ షో యాష్ కి బాత్ వేదికగా జర్నలిస్ట్ విమల్ కుమార్ అడిగిన ప్రశ్నకు అశ్విన్ స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా నంబర్ 3 స్థానంలో పడిక్కల్‌నే బరిలోకి దింపాలని తేల్చి చెప్పారు. సాంకేతిక నైపుణ్యం విషయంలో సాయి సుదర్శన్ కంటే పడిక్కల్ చాలా మెరుగైన బ్యాటర్ అని అభిప్రాయపడ్డారు. సాయి సుదర్శన్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత దేవదత్ పడిక్కల్‌కే ఇవ్వాల్సి ఉండేదని అశ్విన్ వ్యాఖ్యానించడం విశేషం.

డొమెస్టిక్ క్రికెట్‌లో సుదీర్ఘకాలం శ్రమించి, భారీగా పరుగులు సాధించిన తర్వాతే పడిక్కల్‌కు ఈ అవకాశం వచ్చిందని అశ్విన్ గుర్తు చేశారు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా సాయి గాయపడటంతో వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ రెండు చేతులా ఒసిసిపట్టుకున్నారని ప్రశంసించారు. ఇప్పుడు తన టాలెంటును నిరూపించుకున్న తర్వాత అతడిని పక్కన పెట్టడం సమంజసం కాదని, భారత జట్టు తరఫున మూడో స్థానాన్ని అతడే శాశ్వతం చేసుకోవాలని సూచించారు.

సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ టెస్టు కెరీర్ రికార్డులను పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తుంది. సాయి సుదర్శన్ ఇప్పటివరకు 7 టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌లు ఆడి 31.92 సగటుతో 383 పరుగులు చేశారు. అతడి ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. మరోవైపు పడిక్కల్ కేవలం 4 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి 69.67 అద్భుత సగటుతో 418 పరుగులు సాధించారు. గణాంకాల పరంగా కూడా పడిక్కల్ స్పష్టమైన ఆధిక్యంలో ఉండటం అతడికి కలిసివచ్చే అంశం. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నాటికి సాయి సుదర్శన్ కోలుకున్నా, తుది జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారనుంది. అశ్విన్ చెప్పినట్లుగా ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌కే అవకాశం ఇస్తారో లేక సాయి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.అద్భుత సగటుతో 418 పరుగులు సాధించారు. గణాంకాల పరంగా కూడా పడిక్కల్ స్పష్టమైన ఆధిక్యంలో ఉండటం అతడికి కలిసివచ్చే అంశం. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నాటికి సాయి సుదర్శన్ కోలుకున్నా, తుది జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారనుంది. అశ్విన్ చెప్పినట్లుగా ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌కే అవకాశం ఇస్తారో లేక సాయి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *