Headlines

Health Tips: ఇన్నాళ్లు పొరపాటు చేశామా? అరటి పండు తిన్నవెంటనే నిళ్లు తాగడం సేఫేనా?


తక్కు ఖర్చులో ఎక్కువ పోషకాలు అందించే పండు ఏదైనా ఉందంటే అది అరటి పండు మాత్రమే.. ఇందులో మన శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొంతమందికి ఈ పండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణసమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కలిగే నష్టాలు

జీర్ణరసాలు పలుచబడటం: పండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన గ్యాస్ట్రిక్ ఆమ్లాలు, ఎంజైములు పలుచబడి, ఆహారం సరిగ్గా అరగదు. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గ్యాస్, కడుపుబ్బరం: అరటిపండులోని కరిగే ఫైబర్ నీటితో కలిసినప్పుడు కడుపులో ఉబ్బిపోయి, త్వరగా పులిసిపోతుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

చల్లటి నీటితో ముప్పు: అరటిపండు తిన్న వెంటనే చల్లటి నీరు తాగితే రక్తనాళాలు కుంచించుకుపోయి, పొట్టలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.దీని వల్ల మలబద్ధకం, అజీర్తికి దారితీస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

సరైన మార్గం ఏమిటి?

ఒక వేళ మీరు పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగాలి అనుకుంటే 30 నిమిషాల తర్వాత మాత్రమే త్రాగాలి. అంతేకాదు చల్లటి నీటిని మాత్రం అస్సలు తాగకూడదు. గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని మాత్రమే తాగండి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను తింటున్నప్పుడు, ఆ తర్వాత నీరు త్రాగే విషయంలో ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే, జీర్ణ సమస్యలు లేకుండా శరీరానికి సంపూర్ణ పోషణను అందించవచ్చు.

జీర్ణక్రియ మెరుగుపడటానికి చిట్కాలు

మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉండాలన్నా.. ఎలాంటి జీర్ణ సమస్యలు రాకూడదన్నా.. మీరు రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా భోజనం లేదా పండ్లు తిన్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే తిన్న వెంటనే నిద్రపోవడం లేదా వంగి కూర్చోవడం వంటి చేయకండి. కనీసం 30 నిమిషాలు నిటారుగా కూర్చోండి, లేదంటే కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకపై అరటి పండ్లు తినే విషయంలో జాగ్రత్త వహించండి.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *