Headlines

అలాంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు.. ఎవ్వరిని కాపీ కొట్టకుండా స్టార్ అయ్యాడు

అలాంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు.. ఎవ్వరిని కాపీ కొట్టకుండా స్టార్ అయ్యాడు


సహజనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి జయసుధ. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి గురించి నటి జయసుధ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. చిరంజీవితో సుమారు ఐదు, ఆరు చిత్రాలలో కలిసి నటించిన జయసుధ, ఆయన విజయానికి కృషి, క్రమశిక్షణే కీలకమని తెలిపారు. తమ మొదటి సినిమా ప్రాణం ఖరీదు అని గుర్తుచేసుకుంటూ, ముకద్దర్ కా సికిందర్ హిందీ రీమేక్‌లోనూ చిరంజీవి, కృష్ణంరాజు గారితో కలిసి నటించామని, అయితే అందులో తాము జంటగా కనిపించలేదని వివరించారు. ఆయన వైఫ్‌గా రిక్షావోడులో రెండు మూడు సీన్లలో, ఆ తర్వాత మదర్‌గా నటించానని, తాను నిర్మించిన హ్యాండ్స్ అప్ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో మెరిశారని జయసుధ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారితో 20-25 సినిమాలు చేసిన తాను, చిరంజీవితో చాలా తక్కువ చిత్రాలలోనే నటించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక

అయితే, సినిమాల సంఖ్యతో సంబంధం లేకుండా, చిరంజీవి వ్యక్తిత్వం, ఆయన పనితీరు జయసుధను ఎంతగానో ప్రభావితం చేశాయట. “ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు, పెద్ద మార్పు రాలా. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఈ డిఫరెన్స్ ఏమీ లేదు” అని జయసుధ అన్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న స్థాయికి ఆయన అర్హుడని, అది ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్నదని ఆమె స్పష్టం చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వంటి దిగ్గజ నటుల కెరీర్ ప్రారంభాన్ని తాను చూడలేదని, వారు అప్పటికే అగ్రతారలుగా ఉన్నారని, అయితే చిరంజీవి ప్రస్థానాన్ని తాను చూశానని జయసుధ వివరించారు.

ఇది కూడా చదివేయండి : RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో

రామారావు, నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటి అగ్ర హీరోలు ఉన్న సమయంలో, వారి మధ్య నిలదొక్కుకుని ఈ స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలని, చిరంజీవిది అపారమైన హార్డ్‌వర్క్ అని జయసుధ కొనియాడారు. కేవలం అదృష్టం మాత్రమే కాదని, ఆ అదృష్టంతో పాటు ఆయన నిరంతర కృషి అడుగడుగునా కనిపించిందని ఆమె అన్నారు. ఇతరులను కాపీ కొట్టకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకోవడం చిరంజీవి గారికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని జయసుధ అభిప్రాయపడ్డారు. ఆయన లాగా కనిపించాలని, ఆయన లాగా డాన్స్ చేయాలని ఎవరినీ అనుకరించకుండా, తనదైన స్టైల్‌తో పాటలు, డాన్సులు, ఫైట్స్, కథలతో ప్రజలను ఆకట్టుకున్నారని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *