Headlines

అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస..

అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస..


టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అయ్యారు. బాహుబలిలో భల్లాల దేవుడి పాత్రలో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రానా.. సినిమాల్లో ఆయన పాత్ర కోసం ఎంతగా కమిట్‌ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మువీలో రాణా శరీరాకృతితో ప్రత్యేక గుర్తింపు పొందింది. కావల్సిన మేకోవర్‌ కోసం రాణా శారీరకంగా ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు. అయితే బాహుబలి తర్వాత రానాకు హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన ఆహార్యం పూర్తిగా మారిపోయింది. సర్జరీ కోసం యూఎస్‌కి కూడా వెళ్లారు. దీంతో శారీరాకృతిలో మార్పు రావడంతో అప్పటికే ఒప్పుకున్న పలు ప్రాజెక్టులను వదులుకున్నారు. అయితే ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో మామూలు మనిషయ్యారు. కానీ తాజాగా ఆయన లుక్‌ మళ్లీ అభిమానులను కలవరపెట్టింది. గుర్తుపట్టలేనంతగా కనిపించారు.

కండలు తిరిగిన దేహం, కళ్లల్లో కనిపించే కాంతి అన్నీ మాయమయ్యాయి. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. రాణా లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా.. ఈ ఫొటోల్లో చాలా బక్కపలచగా.. సన్నగా.. కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. రూపం నిర్జీవంగా కళలేకుండా ఉంది మరి. తాజాగా బయటకు వచ్చిన ఫోటోల్లో ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రానాకు మళ్లీ ఆరోగ్య సమస్యలు త‌లెత్తాయా? ఎందుకింత సన్నగా మారిపోయారు? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

నిజానికి రానా ప్రస్తుత లుక్ వెనుక ఓ ప్రత్యేకత ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రానా కొత్త ప్రాజెక్ట్‌ ‘జై హనుమాన్’ సినిమా కోసం చేసిన ప్రత్యేక మేకోవర్ ఇందుకు కారణమని సమాచారం. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మువీలో రానా అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారట. మహాభారతంలో శ్రీకృష్ణుడి శాపం కారణంగా యుగాల తరబడి భూమిపై సంచరిస్తున్న అశ్వద్ధామ పాత్రలో సహజంగా కనిపించేందుకు రాణా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారని టాక్‌. అశ్వద్ధామ పాత్రలో వాస్తవికత కనిపించేందుకే రానా ఇలా బక్కచిక్కి శల్యమైనట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. తన పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాణా బరువు తగ్గి ఈ ప్రత్యేక లుక్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక రానా కూడా తన బక్కపలచని శరీరాకృతిపై కూడా స్పందించలేదు. కాగా 2024 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్‌ను షేకాడించిన హనుమాన్ మువీకి సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చిత్రీకరిస్తున్న ఈ మువీలో కాంతారా ఫేం రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రాణా అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *