Headlines

ప్రభుత్వ బ్యాంకుల్లో 11 వేలకుపైగా Clerk ఉద్యోగాలు.. IBPS ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

ప్రభుత్వ బ్యాంకుల్లో 11 వేలకుపైగా Clerk ఉద్యోగాలు.. IBPS ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి సంబంధించి కస్టమర్‌ సర్విస్‌ అసోసియేట్‌ (క్లర్క్‌) పోస్టుల భర్తీకి CRP CSA-XVI నోటిఫికేషన్‌ను IBPS విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 11,403 కస్టమర్‌ సర్విస్‌ అసోసియేట్‌ (క్లర్క్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు, తెలంగాణలో 191 పోస్టులు వరకు ఉన్నాయి. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలు చేపట్టనున్నారు.

ఐబీపీఎస్‌ బ్యాంక్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 186
  • తెలంగాణలో పోస్టుల సంఖ్య: 191
  • కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 1,414
  • ఉత్తరప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 1,731
  • మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 1,051
  • పశ్చిమ బెంగాల్‌లో పోస్టుల సంఖ్య: 946
  • తమిళనాడులో పోస్టుల సంఖ్య: 675
  • గుజరాత్‌లో పోస్టుల సంఖ్య: 698
  • మధ్యప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 570
  • ఢిల్లీలో పోస్టుల సంఖ్య: 415
  • గోవాలో పోస్టుల సంఖ్య: 61
  • కేరళలో పోస్టుల సంఖ్య: 108

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అయితే ఆగస్టు 21, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. 10వ తరగతి లేదా అంతకంటే పై స్థాయిలో స్థానిక భాష చదివిన వారికి LLPT నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 1, 2026వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు తదితర రిజర్వేషన్‌ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 21, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎం/ డీఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు. దీనితో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు, లోకల్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (LLPT), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి



ఐబీపీఎస్‌ బ్యాంక్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు ఇలా..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 1, 2026.
  • దరఖాస్తుల చివరి తేదీ: ఆగస్టు 21, 2026.
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 21, 2026.
  • ప్రిలిమ్స్‌ పరీక్ష: అక్టోబర్‌ 2026
  • ప్రిలిమ్స్‌ ఫలితాలు: నవంబర్‌ 2026
  • మెయిన్స్‌ పరీక్ష: డిసెంబర్‌ 2026
  • తాత్కాలిక కేటాయింపు: మార్చి 2027



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *