Headlines

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి జబర్దస్త్ లేడీ కమెడియన్.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. ఇంతకీ ఎవరంటే..

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి జబర్దస్త్ లేడీ కమెడియన్.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. ఇంతకీ ఎవరంటే..


Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి జబర్దస్త్ లేడీ కమెడియన్.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. ఇంతకీ ఎవరంటే..

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఓవైపు అగ్నీ పరీక్షకు సంబంధించి వరుస ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు. గత సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా సామాన్యులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే చాలా అప్లీకేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు బిగ్ బాస్ సీజన్ 10లోకి రాబోయే సెలబ్రెటీల పేర్లు సైతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. సీరియల్ బ్యూటీ పల్లవి గౌడ, రాకింగ్ రాకేశ్, కావ్య శ్రీ, జబర్దస్త్ వర్ష, సీరియల్ బ్యూటీ తేజస్వి సైతం ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదివరకు జబర్దస్త్ నుంచి చాలా మంది కమెడియన్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇమ్మాన్యుయేల్, అవినాష్, చలాకి చంటి వంటి నటులు హౌస్ లోకి అడుగుపెట్టి అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించారు. లేడీ కమెడియన్ గా ఫైమా సైతం తన ఆట తీరుతో ఆదరగొట్టింది. ఇక ఇప్పుడు మరో లేడీ కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఆమె మరోవరో కాదు.. జబర్దస్త్ పవిత్ర.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో పవిత్ర ఒకరు. తన కామెడీ టైమింగ్, పంచులతో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో తెగ అల్లరి చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు పవిత్ర బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెడుతుందని అంటున్నారు. దీంతో ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదని టాక్. పవిత్ర విషయానికి వస్తే.. ఒకప్పుడు బ్యూటీ పార్లర్ లో పనిచేసిన పవిత్ర.. ప్రస్తుతం జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యారు. ఆమె తండ్రి లారీ డ్రైవర్ కాగా.. మద్యానికి బానిస అయ్యి కుటుంబాన్ని పట్టించుకోలేదని.. దీంతో తన తల్లే కూలి పనులు చేసి తనను పోషించిందని పవిత్ర గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతోపాటు పలు షోలలో పాల్గొంటూ తన కామెడీతో పాపులర్ అయ్యింది. మరోవైపు యూట్యూబ్, సోషల్ మీడియాలో తన లైఫ్ జర్నీ గురించి అనేక వీడియోస్ చేసింది పవిత్ర. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఆమె అడుగుపెడితే ఎంటర్టైన్మెంట్ కు కొదవే ఉండదని అంటున్నారు నెటిజన్స్. చూడాలి మరీ.. ఈసారి పవిత్ర ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

జబర్దస్త్ పవిత్ర పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Pavithra Bathula (@paagal_pavithraa)

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *