Headlines

Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే నటించాడు.. హీరో శ్రీవిష్ణు..

Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే నటించాడు.. హీరో శ్రీవిష్ణు..


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో అవకాశాలు అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కథానాయకుడిగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కంటెంట్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలతో… తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు తన కెరీర్, లైఫ్, ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వివేక్ ఆత్రేయ రైటింగ్, ఆయన సంభాషణలు తనకు చాలా ఇష్టమని, వాటిని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పారు. సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడుతూ, ఆయనకున్న అపారమైన ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాలనే పట్టుదల తనను ఆకట్టుకుంటాయని తెలిపారు. ప్రశాంత్ నీల్ కమర్షియల్ యాస్పెక్ట్, హీరోను ఎలివేట్ చేసే విధానం తనకు మ్యాడ్‌గా నచ్చుతుందని అన్నారు. హసిత్ గోలి ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుందని, “రాజ రాజ చోర” వంటి సినిమా ద్వారా తొమ్మిదేళ్ల పిల్లవాడిని ప్రధాన పాత్రలో పెట్టి కథను నడిపించిన విధానం చాలా కొత్తగా అనిపించిందని చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ నారా రోహిత్‌తో తన స్నేహం గురించి పంచుకున్నారు. తామిద్దరం సినిమాల గురించి చాలా వివరంగా చర్చించుకుంటామని, కొన్నిసార్లు రెండు మూడు రోజులు నిరంతరం మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అంతకు ముందు రోజూ కలుసుకునేవారమని, ఇటీవల తాను షిఫ్ట్ అయినందున ఇప్పుడు వారానికి రెండుసార్లు కలుస్తున్నామని తెలిపారు. వారిద్దరి మధ్య అత్యుత్తమ బహుమతి గురించి అడగ్గా, “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాను ప్రస్తావించారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఆ సమయంలో రోహిత్ మంచి స్టార్‌డమ్‌లో ఉన్నప్పటికీ, శ్రీ విష్ణు అడగకుండానే ఆయన ఆ సినిమాలో నటించడానికి అంగీకరించారని, అది వారిద్దరికీ ఒకరికొకరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని శ్రీ విష్ణు అన్నారు. ఆ రోజుల్లో అలాంటి స్క్రిప్ట్ చేయడమే గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు. వస్తువుల రూపంలో కూడా తాము తరచుగా బహుమతులు పంచుకుంటామని, వాచీలు, గాగుల్స్, క్యాప్‌లు వంటివి ఒకరికొకరు ఇచ్చుకుంటామని తెలిపారు. శ్రీ విష్ణుకు గాగుల్స్ అంటే పిచ్చి అని, రోహిత్‌కు క్యాప్‌లు అంటే ఇష్టమని, అందుకే రోహిత్ ఎక్కడికి వెళ్ళినా క్యాప్‌లు తెస్తారని పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

నారా రోహిత్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *