Headlines

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా..! సరికొత్త ‘CB500’ రెట్రో బైక్ ప్రత్యేకతలు ఇవే

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా..! సరికొత్త ‘CB500’ రెట్రో బైక్ ప్రత్యేకతలు ఇవే


భారత్‌లోనే తయారవుతున్న సరికొత్త ‘Honda CB500’ 501సీసీ సింగిల్ సిలిండర్ బైక్ అద్భుతమైన టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇంటర్‌సెప్టర్ 650కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైన ఈ రెట్రో మోటార్‌సైకిల్ యొక్క మూడు వేరియంట్లు, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు, మార్కెట్ అంచనాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

శక్తివంతమైన 501cc ఇంజిన్

భారత మిడ్‌సైజ్‌ రెట్రో మోటార్‌సైకిల్ మార్కెట్‌లో పోటీని మరింత పెంచేందుకు హోండా సిద్ధమైంది. కంపెనీ తన ఆల్-న్యూ Honda CB500 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ఒకప్పుడు దేశంలో 500సీసీ సింగిల్ సిలిండర్ బైక్‌లకు ప్రత్యేక ఆదరణ ఉండేది. అయితే 2020లో రాయల్ ఎన్ఫీల్డ్ 500సీసీ యూసీఈ ఇంజిన్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ విభాగంలో పెద్దగా ప్రత్యామ్నాయం కనిపించలేదు.

ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడమే లక్ష్యంగా హోండా సీబీ500 రంగంలోకి దిగుతోంది. ఈ కొత్త బైక్‌లో 501సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను హోండా తొలిసారిగా పరిచయం చేసింది. ఇది గరిష్టంగా 27 హెచ్‌పీ శక్తి మరియు 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ పరంగా సంఖ్యలు సాధారణంగా కనిపించినా, టార్ మాత్రం ఈ బైక్‌కు ప్రధాన బలంగా నిలిచింది.

ప్రీమియం ఫీచర్లు

Honda CB350 నుంచి స్ఫూర్తి పొందిన క్లాసిక్ లుక్‌ను CB500లో అందించారు. గుండ్రటి ఎల్ఈడీ హెడ్‌లైట్, రిబ్డ్ సింగిల్ పీస్ సీటు, పెద్ద టియర్‌డ్రాప్ ఆకారంలోని ఇంధన ట్యాంక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రెట్రో స్టైలింగ్‌ను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను జోడించారు. Honda Selectable Torque Control (HSTC), స్లిప్పర్ క్లచ్, అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు Honda RoadSync కనెక్టివిటీ వంటి ప్రీమియం సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇచ్చారు.

ధరల అంచనా

ఈ బైక్‌ను మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. స్టాండర్డ్ అల్లాయ్ వీల్ వేరియంట్‌తో పాటు క్రాస్-స్పోక్ ట్యూబ్లెస్ వీల్ వేరియంట్, ప్రత్యేక గ్రాఫిక్స్‌తో కూడిన టాప్-ఎండ్ క్రాస్-స్పోక్ ట్యూబ్లెస్ వేరియంట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఇది భారత్‌లోనే తయారవుతుండటంతో ఉత్పత్తి వ్యయం తగ్గి ధర కూడా పోటీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *