Headlines

మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు..

మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు..


సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అనగానే అందరికీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా వందలాది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, భౌగోళిక వ్యూహం, సాంకేతిక క్లిష్టత, మరణాల రేటు ప్రాతిపదికన చూస్తే.. ఎవరెస్ట్ కంటే అత్యంత భయంకరమైన, ప్రాణాంతకమైన పర్వతాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. వీటిని అధిరోహించడం అసాధారణమైన ధైర్యసాహసాలతో కూడుకున్న పని. నిజమైన ధైర్యం, అసాధారణ ప్రతిభ, భౌతిక సామర్థ్యం ఉన్నవారు మాత్రమే వీటిని చేరుకోవడానికి సాహసిస్తారు.

1. K2 (సావేజ్ మౌంటెన్):

ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన పర్వతమైన K2 ను సావేజ్ మౌంటెన్ అని పిలుస్తారు. ఇక్కడ వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. నిటారైన రాయి, మంచు దారులు ఉండటం వల్ల ఇక్కడ అధిరోహణ అత్యంత ప్రమాదకరం. K2 శిఖరాన్ని చేరుకునే క్రమంలో ప్రతి నలుగురిలో ఒకరు ప్రాణాలు కోల్పోతుంటారు.

2. అన్నపూర్ణ పర్వతం :

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం గణాంకాల ప్రకారం అత్యంత ప్రాణాంతకమైనది. ఇక్కడ తరచూ సంభవించే హిమపాతాలు పర్వతారోహకులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇక్కడ మరణాల రేటు దాదాపు 30శాతం పైగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి



3. నంగా పర్బత్:

పాకిస్తాన్‌లో ఉన్న ఈ పర్వతాన్ని కిల్లర్ మౌంటెన్ అని పిలుస్తారు. దీని రూపాల్ ఫేస్ ప్రపంచంలోనే అతిపెద్ద నిటారైన రాతి గోడ. దీనిని అధిరోహించడం శారీరకంగా, మానసికంగా తీవ్రమైన పరీక్ష.

4. కాంచన్‌జంగా:

భారతదేశం, నేపాల్ సరిహద్దులో ఉన్న కాంచన్‌జంగా ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వతం. ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చినా, ఈ పర్వతంపై మరణాల రేటు ఇప్పటికీ తగ్గకపోవడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.

5. ఆయిగర్ (Eiger – ది మర్డర్ వాల్):

స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ఉన్న ఆయిగర్ పర్వత ఉత్తర భాగాన్ని ది మర్డర్ వాల్ అంటారు. రాళ్ళు విరిగిపడటం, తీవ్రమైన చలి కారణంగా ఇక్కడ అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

6. బెయింతా బ్రాక్:

ది ఓగ్రే అని పిలిచే ఈ పర్వతం పాకిస్తాన్‌లో ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన సాంకేతిక పర్వతారోహణ సవాళ్లను విసురుతుంది. చరిత్రలో అతి తక్కువ మంది మాత్రమే దీని శిఖరాన్ని విజయవంతంగా చేరుకోగలిగారు.

7. ఫిట్జ్ రాయ్ :

దక్షిణ అమెరికాలోని పటగోనియా సరిహద్దులో ఉన్న ఈ పర్వతం ఎత్తు తక్కువే అయినప్పటికీ, దాని నిటారైన గ్రానైట్ రాళ్ళు మరియు తీవ్రమైన గాలుల వల్ల దీనిని అధిరోహించడం చాలా కష్టం.

పర్వతారోహణ అనేది కేవలం శారీరక దృఢత్వమే కాక, ప్రకృతి సవాళ్ళను తట్టుకునే మానసిక ధైర్యానికి ప్రతీక. ఈ 7 పర్వతాలు మానవ సహనానికి, పట్టుదలకు అంతిమ పరీక్షగా నిలుస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *