ఈ విజయం తర్వాత, ఈ చిత్ర రెండవ భాగం గతేడాది అక్టోబర్లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం రూ. 800 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కర్ణాటకలోని తుళునాడు సంస్కృతి, ‘భూత కోల’ సంప్రదాయం , మానవునికి-ప్రకృతికి నడుమ ఉండే బంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి కనబరిచిన నటన, అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులచేత నీరాజనాలు అందుకున్నాయి.