డైరెక్టర్ సాయి రాజేష్. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సాయి రాజేష్ కథను అందించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. దర్శకుడిగా బేబీ సినిమాతో హిట్ అందుకున్న సాయి రాజేష్, ఇప్పుడు రచయితగానూ హిట్ అందుకున్నాడు. కాగా గతంలో సాయి రాజేష్ హీరో సంపూర్ణేష్ బాబుతో తమ సుదీర్ఘ అనుబంధం గురించి ఆసక్తికరమైన, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హృదయ కాలేయం సినిమా విడుదలకు ముందు, తర్వాత తమ జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలను, ఇద్దరి మధ్య నెలకొన్న బలమైన స్నేహ బంధాన్ని ఆయన వివరించారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను హీరోల కోసం ఎదురుచూసి, కథలు చెప్పినా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని సాయి రాజేష్ తెలిపారు. అప్పుడే ఒక పిచ్చి సినిమా తీసి, ఒక పిచ్చి హీరోని సృష్టించి కామెడీ చేద్దామనే ఆలోచనతో హృదయ కాలేయం కథ పుట్టిందని చెప్పారు. ఇదే ప్రసాద్ ల్యాబ్స్ వద్ద షార్ట్ ఫిల్మ్ చూడటానికి వచ్చి, ఉపేంద్ర గారి గెటప్‌ను పోలిన వేషధారణలో ఉన్న సంపూర్ణేష్ బాబును చూసి, తన హీరో దొరికాడని సాయి రాజేష్ ఫిక్స్ ఆయ్యాడట..
ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
ఆ రోజుల్లో తాను కేవలం ఒక హోండా షైన్ బైక్, రూ. 50-60 వేల అప్పులతో ఉన్నానని సాయి రాజేష్ గుర్తు చేసుకున్నారు. సంపూర్ణేష్ బాబు సిద్ధీపేటలో ఉండేవారని, కథ చర్చించడానికి ఆయన్ను పిలిపించుకోవాలంటే చాలా ఖర్చయ్యేదని చెప్పారు. తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేని సందర్భాల్లో తన వద్ద ఉన్న రూ. 500లోంచి రూ. 200 సంపూర్ణేష్‌కు ఇచ్చేవారని, ఒక్కోసారి తిరిగి వెళ్ళలేక ప్రసాద్ ల్యాబ్స్ బయట గడ్డిలోనో, కృష్ణానగర్‌లో రోజుకు రూ. 150-200 చెల్లించి మడత మంచాలపై పడుకునేవాడిని అని సాయి రాజేష్ తెలిపారు.
ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా
అనేక కష్టాల తర్వాత హృదయ కాలేయం విడుదలవడం, అది సూపర్ హిట్‌గా నిలవడం చారిత్రకమని సాయి రాజేష్ అన్నారు. సినిమా విజయం తర్వాత సంపూర్ణేష్ బాబుకు లక్షల్లో రెమ్యునరేషన్లు వచ్చాయని, సిద్ధీపేటలో మూడు, నాలుగు అంతస్తుల ఇల్లు నిర్మించుకున్నాడని, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనుక్కున్నాడని తెలిపారు. తాను మాత్రం అప్పుడు కూడా నానో కారు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌తో ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఈ పరిస్థితులను గమనించిన సంపూర్ణేష్ బాబు గొప్ప మనసుతో, ఎవరికీ తెలియకుండా సాయి రాజేష్ కోసం రూ. 6 లక్షల డౌన్‌పేమెంట్ కట్టి హోండా కారు కొనిచ్చారని సాయి రాజేష్ వెల్లడించారు. 2018లో సంపూర్ణేష్ భార్య సూచనతో, మణికొండలో ఒక అపార్ట్‌మెంట్‌కు తనకు చెప్పకుండానే రూ. 12 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టి, మిగిలిన రూ. 13 లక్షలు తాను కట్టాలని చెప్పిన విషయాన్ని సాయి రాజేష్ గుర్తుచేసుకున్నారు. ఏ రోజుకైనా సంపూర్ణేష్ కోసం తాను, తన కోసం సంపూర్ణేష్ ఉంటారని సాయి రాజేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.