Headlines

OTT Movie: డబ్బులు ఇలా కూడా సంపాదించొచ్చా? ఓటీటీలో ‘లక్కీ భాస్కర్’ లాంటి థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో..

OTT Movie: డబ్బులు ఇలా కూడా సంపాదించొచ్చా? ఓటీటీలో ‘లక్కీ భాస్కర్’ లాంటి థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో..


ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. థియేటర్లలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతోండగా ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే దీవానా సినిమా ఓటీటీలోకి రాగా రేపు (జులై 30) మరికొన్ని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాయి. అయితే వీటి సంగతి పక్కన పెడితే.. గత వారం ఓటీటీలోకి వచ్చేసిన ఒక సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. పేరుకు తమిళ సినిమానే అయినా తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండడంతో ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. గతంలో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా లాగే ఇందులో డబ్బు కోసం ఓ ఫ్యామిలీ ఏం చేసిందన్నది మెయిన్ థీమ్ పాయింట్. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోన్న ఈ సినిమా పేరు కాన్ సిటీ (Con City). ఓజీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన అర్జున్ దాస్ ఇందులో హీరోగా నటించాడు. అలాగే కల్కి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా బెన్ ఇందులో కథానాయికగా చేసింది. వీరితో పాటు
యోగిబాబు, వడివుక్కరసి, నందగోపాల్‌, అఖిలన్‌ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి హరీష్ దురైరాజ్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని పవర్ హౌస్ పిక్చర్స్, మాలి & మాన్వి మూవీ మేకర్స్, క్లౌడ్ స్టూడియోస్, సిల్వర్ ట్రీ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇవి కూడా చదవండి



కాన్ సిటీ సినిమాపై ఒక నెటిజన్ రివ్యూ

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

కాన్ సిటీ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *