Headlines

EPFO: ఒక్క ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ వివరాలన్నీ.. కేంద్రం కొత్త ఆన్‌లైన్ పోర్టల్.. ఇకపై నో టెన్షన్..

EPFO: ఒక్క ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ వివరాలన్నీ.. కేంద్రం కొత్త ఆన్‌లైన్ పోర్టల్.. ఇకపై నో టెన్షన్..


మీరు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ఉద్యోగం మారాలా..? పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్ మార్చిపోయారా..? అసలు ఆ అకౌంట్ జాడే కనిపించడం లేదా? అయితే ఇక నుంచి టెన్షన్ పడనక్కర్లేదు. ఈపీఎఫ్ఓ కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ పోర్టల్‌ను అభివృద్ది చేయగా.. త్వరలో లాంచ్ చేయనుంది. ఈ పోర్టల్ ద్వారా జస్ట్ ఆధార్ నెంబర్‌తో మీ పాత పీఎఫ్ ఖాతాను కనిపెట్టవచ్చు. అలాగే ఆ అకౌంట్‌ను యాక్టివ్ చేసుకోవడంతో పాటు అందులోని బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అవసరమైతే పాత పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇనాక్టివ్ అయిన ఖాతాలను పరిష్కరించడం, బకాయిలను క్లెయిమ్ చేసుకునేలా లబ్దిదారులను ప్రోత్సహించేందుకు ఈపీఎఫ్ఓ ఈ పోర్టల్ తీసుకొచ్చింది.

ఒకసారి ఉద్యోగం మారిన తర్వాత పాత పీఎఫ్ అకౌంట్‌కు కనిపెట్టడం, అందులోని నగదును విత్ డ్రా చేసుకోవడం కష్టతరంగా మారుతుంది. పేపర్ వర్క్, వెరిఫికేషన్ ప్రాసెస్ లాంటి స్టెప్స్ చాలా ఉండటం వల్ల చాలామంది క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దాదాపు 30,91,862 ఇనాక్టివ్ ఖాతాలు ఉన్నట్లు పీఎఫ్ సంస్థ గుర్తించగా.. వాటిలో దాదాపు రూ. 9,330 కోట్ల క్లెయిమ్ చేయని సొమ్ము మిగిలి ఉంది. వీటిని పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ ఆధార్ ఆధారిత డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా పాత ఖాతాలను గుర్తించి నగదు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న యూఏఎన్‌కు పాత అకౌంట్లోని బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవచ్చు. కేవలం ఒక్క ఆధార్ నెంబర్‌తో పని సులువుగా పూర్తవుతుంది. దీని వల్ల పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

2014లో UAN వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ముందు పీఎఫ్ ఖాతాలు ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త పోర్టల్ ఉపయోగపడనుంది. అంతకముందు చాలామంది ఉద్యోగులు వేర్వేరు యజమానులతో అనుసంధానించబడిన బహుళ EPF ఖాతా నంబర్లు కలిగి ఉన్నారు. కానీ అవి ఇప్పటివరకు UANకు అనుసంధానించబడలేదు. దీనివల్ల వారు తమ అకౌంట్లను కనుగోనడం, వాటిల్లోని నగదును తీసుకోడం కష్టతరంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఈ కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు చాలామంది తమ పాత పీఎఫ్ అకౌంట్లను గుర్తించేందుకు ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాకుండా అవసరమైన ధృవపత్రాలు, దరఖాస్తులు సమర్పించాల్సి వస్తోంది. ఇక నుంచి అవేమీ అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పాత అకౌంట్లను గుర్తించవచ్చు. దీని వల్ల పీఎఫ్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *