దొంగమల్లన్న ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం, మల్లన్న పేట గ్రామంలో ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 10 కిలో మీటర్ల దూరంలో ఈ అద్భుతమైన ఆలయం ఉంటుంది. దీనికి దొంగ మల్లన్న అనే పేరు రావడం, ఈ ఆలయం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా, ఇప్పుడు మనం ఆలయం వెనకున్న జానపదకథల గురించి వివరంగా తెలుసుకుందాం.