Headlines

Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి

Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి


Gold, Silver Prices: దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా బంగారం పెరుగుదలలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. వెండి కూడా దిగి వస్తూనే ఉంది. తాజాగా జూలై 29న తులం బంగారం ధర రూ.1,44,160 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఒక్క రోజే బంగారం ధరపై వెయ్యి రూపాయల వరకు దిగి రాగా, అదే వెండిపై 5 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  • తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,130 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,290
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,150 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140

అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉంది?

నిన్న ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్సుకు $53.30 లేదా 1.31 శాతం తగ్గి $4,023.50 కి పడిపోయింది. స్పాట్ వెండి కూడా 2 శాతం తగ్గి ఔన్సుకు $57.24 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కైనాత్ చైన్‌వాలా తెలిపారు. డాలర్ ఒక నెలలో కొత్త గరిష్ట స్థాయి అయిన 101.57 కి చేరుకుంది. బుధవారం ఫెడరల్ రిజర్వ్ నిర్ణయానికి ముందే ఇది జరిగింది. దీనివల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెరిగింది.

ఇది కూడా చదవండి: ITR: మిత్రమా..! ఇంకా 2 రోజులే సమయం ఉంది.. ఈ 10 పొరపాట్లు అస్సలు చేయకండి!

రూపాయి బలపడటం వల్ల దేశీయ మార్కెట్లో దిగుమతి చేసుకున్న బులియన్ (బంగారం, వెండి) ల్యాండెడ్ కాస్ట్ తగ్గిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు, బలహీనమైన ప్రపంచ ధోరణులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందున్న జాగ్రత్త, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మందకొడిగా ఉంచాయి.

అయితే మెజారిటీ ప్రజలు ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు స్థిరంగా ఉంచే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు కనుక స్థిరంగా ఉంచినట్లయితే బంగారం ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో ఈక్విటీ షేర్లు నష్టపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ప్రత్యామ్నాయంగా గోల్డ్ లో ప్రవేశపెడుతుంటారు. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్లో పుంజుకుంటాయో అప్పుడు బంగారం లోనే పెట్టుబడులను బయటకు తీసి ఈక్విటీ మార్కెట్లలో జొప్పించేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇది కూడా చదవండి: Petrol Price: లీటర్‌ పెట్రోల్‌ రూ.167.. లాభాలు తెలిస్తే ఇదే కొట్టిస్తారు..!

ఇది కూడా చదవండి: Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *