కర్నూల్, జులై 28: నంద్యాల జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతుల టమోటాలను కిలో 15 రూపాయల ప్రకారం విక్రయించాలని అధికారులు ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలించారు. అయితే బహిరంగ మార్కెట్లో టమోటా ధర కిలోకు సుమారు 10 మాత్రమే ఉండటంతో మార్కెట్ యార్డులో 15 రూపాయల ధరకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో టమోటాలు అమ్ముడుపోలేదు.
ఈ నేపథ్యంలో జనసేన నాయకులు ఆ టమోటాలను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఉచిత పంపిణీ జరుగుతోందన్న సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో పట్టణవాసులు మార్కెట్ యార్డుకు చేరుకుని తమకు అందినంత మేర టమోటాలను తీసుకువెళ్లారు. ప్రజలు టమోటాలను సంచులలో బాక్సులలో కవర్లలో తమ అవసరం కంటే ఎక్కువగా మోసుకపోయారు.