Headlines

సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ దగ్గర భారీ యుద్ధం

సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ దగ్గర భారీ యుద్ధం


విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నిజంగానే వాయిదా పడబోతుందా..? ఆ వార్తలతో సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని మార్పులు జరగబోతున్నాయి..? అన్నయ్య వదిలేసిన రిలీజ్ డేట్‌ను కబ్జా చేయడానికి తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నారా..? ఒకేసారి ఇన్ని సినిమాలు సెప్టెంబర్ 10, 11 తేదీల కోసమే ఎందుకు పోటీ పడుతున్నాయా..? ఈ వార్‌లో చివరకు విన్నర్‌గా నిలిచేది ఎవరు? టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 10, 11 తేదీల కోసం మేకర్స్ మధ్య పెద్ద యుద్ధం జరగబోతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సినిమా వాయిదా పడే అవకాశం ఉండటంతో ఆ డేట్ కోసం మిగిలిన వాళ్లు కర్చీఫ్ వేస్తున్నారు. అన్నయ్య సినిమా రావడం లేదు కాబట్టి ఆ ఖాళీ అయిన ప్లేస్‌లో తన ఎపిక్ సినిమాతో ఎంటర్ అయిపోవాలని తమ్ముడు ఆనంద్ దేవరకొండ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇదే రిలీజ్ డేట్ రేసులో సెప్టెంబర్ 10న తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెండు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సినిమాను సెప్టెంబర్ 10నే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న మారెమ్మ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11న జరగబోయే బాక్సాఫీస్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. ఫహాద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి సమర్పిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో పాటు.. సుమంత్ నటిస్తున్న మహేంద్రగిరి వారాహి సైతం అదేరోజు రానున్నాయి. రెండు రోజుల్లో 5 సినిమాలు వస్తుండటంతో.. ఈ క్లాష్‌‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *