Headlines

Sai Pallavi: సౌత్‌కు సాయి పల్లవి రీఎంట్రీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ!

Sai Pallavi: సౌత్‌కు సాయి పల్లవి రీఎంట్రీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ!


తండేల్ తరువాత సౌత్ ఒక్క సినిమా కూడా సైన్ చేయని సాయి పల్లవి మళ్లీ స్పీడు పెంచారు. నార్త్ మూవీ రామాయణ షూటింగ్ పూర్తి కావటంతో తిరిగి హోం గ్రౌండ్ మీద ఫోకస్ చేస్తున్నారు. వరుస సినిమాలు సైన్‌ చేస్తూ సౌత్ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ బ్యూటీ లైనప్‌ చూసి సౌత్‌ ఆడియన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అమరన్‌, తండేల్‌ లాంటి బ్లాక్ బస్టర్స్‌ తరువాత పూర్తిగా సౌత్ సినిమాకు దూరమయ్యారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. నార్త్‌లో రామాయణ, ఏక్‌ దిన్‌ సినిమాలతో బిజీ అవ్వటంతో సౌత్‌ మేకర్స్‌కు టైమ్‌ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆ సినిమాలు పూర్తి కావటంతో మళ్లీ సౌత్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఆల్రెడీ ధనుష్ హీరోగా రూపొందుతున్న ఓం సినిమాలో నటిస్తున్నారు. గతంలో మారి సినిమాలో ధనుష్‌తో కలిసి నటించిన సాయి పల్లవి మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాను కూడా పట్టాలెక్కించారు. మరోవైపు తెలుగులో కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి పల్లవి ఓ మైథలాజికల్ మూవీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరిగినా.. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ పక్కన పెట్టేశారు. సినిమా బడ్జెట్‌, మార్కెట్‌, ఓటీటీ బిజినెస్‌ లాంటి లెక్కలు చూసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా సాయి పల్లవి సౌత్‌లో మళ్లీ యాక్టివ్ అవ్వటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *