మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు శస్త్ర చికిత్స విజయవంతమైంది. పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం కాగా సోమవారం (జులై 27) కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరిగింది. హ్యాండ్ సర్జరీలో స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఈ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. రామ్ చరణ్ కు కనీసం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ఫిజయో థెరపీ కూడా తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రామ్ చరణ్ భార్య ఉపాసనకు కుటుంబానికి చెందిన ‘అపోలో’ హాస్పిటల్స్, ‘కామినేని’ హాస్పిటల్స్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం ఉపాసన కూడా అపోలో ఆస్పత్రి లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత బంధువుల హాస్పిటల్స్ ఉండగా.. రామ్ చరణ్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూరుకు వెళ్లడంపై సోషల్ మీడియాలో భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనక ఓ ప్రత్యేక కారణముందని తెలుస్తోంది. అదేంటంటే..
‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుంటే సరిపోతుందని మొదట భావించినా ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయాల్సిందేనన్నారు వైద్యులు. దీంతో రామ్ చరణ్ కోయం బత్తూరులోని గంగా ఆస్పత్రిని ఎంచుకున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాలను కాదని మెగా పవర్ స్టార్ ఈ కోయం బత్తూరు ఆస్పత్రినే ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణముంది. అదేంటంటే.. ఆర్డోపెడిక్ కు సంబంధించి ఇండియాలోనే గంగా హాస్పిటల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ వైద్యులు క్లిష్టమైన చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, స్పోర్ట్స్ ఇంజరీ సర్జరీలు చేయడంలో స్పెషలిస్ట్‌లు.
ఇక రామ్ చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ హ్యాండ్ సర్జరీలో నిపుణుడు. అలాగే ఇదే సర్జరీలో భాగమైన డాక్టర్ ఎన్ రాజశేఖరన్ కు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉపాసన కు చెందిన అపోలో ఆస్పత్రిలో కూడా ప్రపంచస్థాయి ఆర్థోపెడిక్ నిపుణులు ఉన్నారు. అయితే మణికట్టు వంటి సున్నితమైన భాగాలకు సంబంధించి ప్రత్యేకమైన మైక్రో-సర్జికల్ నిపుణులు అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ కోయం బత్తూరు ఆస్పత్రిని ఎంచకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.