Headlines

Job Astrology: ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Job Astrology: ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?


ఆగస్టు నెలలో కుజ, శుక్ర, బుధ, రవి గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో కుజుడు మిథునంలోకి, శుక్రుడు కన్యలోకి, బుధుడు కర్కాటకంలోకి మారుతుండగా, ఆగస్టు 16న రవి సింహ రాశిలోకి మారుతున్నాయి. ఈ గ్రహ మార్పుల వల్ల ఉద్యోగంలో మార్పు రావడం, ఉద్యోగం మారడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం, ఉద్యోగంలో శుభ ఇతర పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతాయి. మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఉద్యోగపరంగా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో, దశమాధిపతి శని వ్యయంలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంలో దూర ప్రాంతాల్లో గానీ, విదేశాల్లో గానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు దూర ప్రాంతాలకు స్థాన చలన సూచనలున్నాయి. నిరుద్యో గులే కాక, ఉద్యోగులు కూడా విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నాలు చేయడం మంచిది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని ఉండడం, రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో ప్రవేశించడం వంటి కారణాల వల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆగస్టు ప్రథమార్థంలో తప్పకుండా సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. సీనియర్ ఉద్యోగులకు పదోన్న తులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి.
  3. సింహం: రాశ్యధిపతి రవి ఆగస్టు 15 వరకు వ్యయ స్థానంలోనూ, ఆ తర్వాత సొంత రాశిలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో బాగా దూర ప్రాంతంలో ఆశిం చిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం కూడా మంచిది. మొదటి వారంలో ఉద్యోగపరంగా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగులు బదిలీ కావడానికి గానీ, ఉద్యోగం మారడానికి గానీ అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్న శుక్రుడు ఆగస్టు మొదటి వారంలో లాభ స్థానంలోకి ప్రవేశించడం, రాశ్యధిపతి కుజుడు మిథునంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి సమీప భవిష్యత్తులో తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యో గం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. విదేశీ ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి



  6. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో ఆగస్టు 2 నుంచి శుక్ర సంచారం ప్రారంభం కావడం, కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. స్వదేశంలోనే దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి.. ప్రభుత్వంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు పదోన్నతితో పాటు ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి.. స్థాన చలనానికి, ఉద్యోగం మారడానికి అవకాశం లేదు.
  7. మకరం: ఈ రాశికి దశమాధిపతి అయిన శుక్రుడు ఆగస్టు 2న భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుందని చెప్పవచ్చు. కుజ, బుధులు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల వీరు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా వీరికి సొంత ఊర్లోనే మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *