ప్రేమకు, పెళ్ళికి వయసుతో సంబంధం లేదు.. దీనిని సినిమా ఇండస్ట్రీవాళ్లు కాస్త గట్టిగానే ఫాలో అవుతున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు అలాగే చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అంతే కాదు వయసులో తనకన్నా పెద్ద వాళ్లను లేదా మరీ చిన్న వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ బోలెడంతమంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ రూటే సపరేటు. 50ఏళ్లు దాటినా కూడా సింగిల్ గా ఉంటూ రిలేషన్ షిప్స్ తో వార్తల్లో నిలుస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికే ఒకరితో విడాకులు, మరొకరితో బ్రేకప్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ తో చట్టపట్టాలేసుకు తిరుగుతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ.. మలైకా అరోరా.
ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో విడిపోయింది ఈ అమ్మడు. ఆ సమయంలో అర్జున్ కపూర్ తో ప్రేమ, డేటింగ్ అంటూ నెట్టింట వైరల్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరి మధ్య వయసు 12 సంవత్సరాల వ్యత్యాసం. మలైకా అరోరా అర్జున్ కంటే ఏకంగా 12 సంవత్సరాలు పెద్దది. మలైకా గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వారికి అర్హాన్ అనే 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్ధల కారణంగా ఇద్దరూ 2017 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. అయితే, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 2024 లో ఇద్దరూ విడిపోయారు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మలైకా తనకంటే 19 సంవత్సరాలు చిన్న యువకుడితో మరోసారి ప్రేమలో పడింది.
ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా
అతడి పేరు హర్ష్ మెహతా. ముంబైకి చెందిన ప్రసిద్ధ వజ్రాల వ్యాపార కుటుంబానికి చెందినవాడు ఈ హర్ష్. ప్రస్తుతం అతని వయస్సు 33 సంవత్సరాలు. అతడు తన కుటుంబం లాగే వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. హర్ష్ మెహతా గత కొంతకాలంగా 52 ఏళ్ల మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ విమానాశ్రయంలో, కొన్ని ప్రైవేట్ పార్టీల్లో కలిసి కనిపించారు. ఈ ఇద్దరూ చట్టపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంట పడుతున్నారు. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ప్రైవేట్ పార్టీకి హాజరైంది. ఇదే పార్టీలో హర్ష్ మెహతా కూడా సందడి చేయడంతో ఈ ఇద్దరి డేటింగ్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది.
ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి