Headlines

సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే?

సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. పెరుగుతున్న ధర నేపథ్యంలో పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇటీవలే మన మార్ట్‌లలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయించేందుకు సిద్ధమైంది. ఇటీవలే బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అందజేసే ఈ బియ్యం సామాన్య ప్రజలకు భారీ ఊరటను కల్పించనున్నాయి.

ఈ నిర్ణయం ప్రకారం.. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం ( రా రైస్ ) రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి నాదేండ్ల ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని తెలిపారు.

బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారని పవన్ కల్యాణ్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *