
ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు చాలా మంది ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అవుతున్నారు. కేవలం హీరోలుగానే కాదు విలన్స్ గానూ నటించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగ్తా ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేక సతమతం అవుతున్నారు. దాంతో కొంతమంది సహాయక పాత్రలు, ఇతర హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అదే లిస్ట్ లోకి వస్తాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన విలన్ గానూ నటించాడు. కానీ హీరోగా స్టార్ డమ్ సొంతం చేసుకోవడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు ట్రై చేసినా పెద్దగా లాభం లేకుండాపోతుంది. ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?
పై ఫొటోలో కనిపిస్తున్న హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ ఎవరో కాదు సుధీర్ బాబు. హీరో సుధీర్ బాబుకు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరో మహేష్ బాబు బావగా కాకుండా తన సహజ నటనతో సినీరంగంలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ యంగ్ హీరో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు.
ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా
కెరీర్ బిగినింగ్ లో ఏ మాయ చేశావే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆతర్వాత SMS (శివ మనసులో శృతి)తో హీరోగా మారాడు. ప్రేమకథా చిత్రమ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు సుదీర్ బాబు. ఇప్పటివరకు సుధీర్ బాబు 21 సినిమాలు చేసిన వాటిలో రెండు మూడు మాత్రమే హిట్స్ ఉన్నాయి. ఇక విలన్ గా ఓ హిందీ సినిమాలోనూ నటించాడు టైగర్ ష్రాఫ్ నటించిన బాగీ సినిమాలో విలన్ గా నటించాడు. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నాడు.
ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి