
హిందూపురం MLA నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడిన బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్నారు. దీంతో.. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం చంద్రబాబు.. AIG ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సినీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కర్నాటకలోని కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 18మంది వేద పండితులతో మహాయాగం, దాన్వంతరి హోమం నిర్వహించారు. ఈ పవిత్ర క్రతువులో దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు నందమూరి అభిమానులు, చిత్ర సీమకు చెందిన పలువురు పాల్గొని బాలయ్య ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక.. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లోనే బాలకృష్ణ గాయపడ్డారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ AIG ఆస్పత్రిలో బాలకృష్ణ ట్రీట్మెంట్లో ఉన్నారు.
కాగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రాక్ స్టార్ మంచు మనోజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ బాలయ్య అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ టీజర్ లో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఈ క్రమంలోనే ఎన్బీకే 111 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ లోనే బాలయ్య గాయపడ్డారు. మంచు మనోజ్‌తో యాక్షన్ సీన్ చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే షూటింగ్ నిలిపేసిన ఈ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఇటీవలే ఆయనకు సర్జరీ నిర్వహించిన వైద్యులు మరో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
బాలయ్యతో చంద్రబాబు..
ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పరామర్శించారు. pic.twitter.com/aZQ3FpIJIY
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.