Headlines

Ram Charan: రామ్‌చరణ్‌కు సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ.. వీడియో

Ram Charan: రామ్‌చరణ్‌కు సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ.. వీడియో


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా ఉండనున్నారు. ఈ సర్జరీను ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్‌లో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేయనుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, అనంతరం రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన కోసం ప్రార్థిస్తున్నారు.


ఇవి కూడా చదవండి



ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది బ్లాక్ బస్టర్ అయ్యింది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  కాగా దీని తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. RC 17 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *