కానీ ‘అబ్సెషన్’ చిత్రం ఇండియాలో విడుదలయ్యాక కేవలం మొదటి వారంలోనే దాదాపు రూ. 18.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 50% పైగా ఆక్యుపెన్సీ నమోదు చేస్తూ, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఏలాంటి భారీ స్టార్ డమ్ లేకుండా, కేవలం బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, సరైన నిడివితో వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘అబ్సెషన్’ సినిమా మరోసారి నిరూపించింది.