Headlines

ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?


ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

మీరు జమ చేసిన సొమ్ముకు ఎలాంటి ముప్పు లేకుండా ప్రతి నెలా కొంత ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఎలాంటి రిస్క్ లేకుండా నేరుగా మీ ఖాతాలో స్థిరమైన వడ్డీ జమ అవుతుంది. ఇటీవల ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం.. ఈ పథకంలో దంపతులు కలసి గరిష్టంగా పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ.19,000లకు పైగా నెలానెలా ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఏమిటీ పోస్ట్ ఆఫీస్ MIS పథకం?

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ఒకేసారి డిపాజిట్ పథకం. ఇందులో ఒకసారి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా డిపాజిటర్ ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 7.4శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం వ్యవధి 5 సంవత్సరాలు.

పెట్టుబడి పరిమితులు ఎంత?

సింగిల్ అకౌంట్: ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా రూ.9 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు.

జాయింట్ అకౌంట్: భార్యాభర్తలు లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరిచి గరిష్టంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు.

నెలకు రూ.20,000 వరకు ఆదాయం ఎలా వస్తుంది?

జాయింట్ అకౌంట్ ద్వారా : భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్‌లో గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, 7.4శాతం వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి రూ. 1,11,000 వడ్డీ వస్తుంది. దీన్ని 12 నెలలకు విడదీస్తే.. ప్రతి నెలా రూ. 9,250 వరకు మీ ఖాతాలో జమ అవుతుంది.

ఇద్దరూ విడివిడిగా సింగిల్ అకౌంట్ తెరిస్తే: ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా సింగిల్ అకౌంట్లు తెరిచి, ఒక్కొక్కరూ గరిష్ట పరిమితి అయిన రూ.9 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తే..
ఒకరి అకౌంట్‌పై రూ.9 లక్షలకు నెలకు రూ. 5,550 వడ్డీ లభిస్తుంది. ఇద్దరి అకౌంట్లపై కలిపి ప్రతి నెలా రూ.11,100 వరకు స్థిరమైన ఆదాయం వస్తుంది. ఒకవేళ కుటుంబంలో ఇతర సభ్యుల పేరిట కూడా స్కీమ్ ఓపెన్ చేస్తే నెలకు దాదాపు రూ.20,000ల వరకు నికర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ఈ పథకం ముఖ్య ప్రయోజనాలు

పూర్తి ప్రభుత్వ భద్రత: పోస్ట్ ఆఫీస్ పథకాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి మీ పెట్టుబడికి 100శాతం గ్యారంటీ ఉంటుంది.

రిస్క్ లేని రాబడి: షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇందులో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు.

రీ-ఇన్వెస్ట్‌మెంట్: ప్రతి నెలా వచ్చే ఈ వడ్డీ డబ్బులను మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో జమ చేయడం ద్వారా చక్రవడ్డీతో మరింత ఎక్కువ రాబడి పొందవచ్చు.

ముందే ఖాతా మూసివేత: అత్యవసర పరిస్థితుల్లో 1 సంవత్సరం పూర్తయిన తర్వాత కాస్త జరిమానాతో అకౌంట్‌ను క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

భారత పౌరుడైన ప్రతి ఒక్కరూ ఈ ఖాతాను తెరవవచ్చు. 10 సంవత్సరాలు దాటిన మైనర్ల పేరిట కూడా తల్లిదండ్రులు ఖాతా ప్రారంభించవచ్చు. సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి కేవైసీ వివరాలు సమర్పించి సులభంగా ఈ MIS ఖాతాను ప్రారంభించవచ్చు. సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ పొందిన వారు, ప్రతినెల స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ MIS ఒక అద్భుతమైన మార్గం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *