Headlines

OTT Cinema : ఆ ఒక్క ట్విస్టుతో సినిమా సూపర్ హిట్.. ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Cinema : ఆ ఒక్క ట్విస్టుతో సినిమా సూపర్ హిట్.. ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..


ఇటీవల బాక్సాఫీస్ పాజిటివ్ రివ్యూస్ అందుకుని యువతను ఆకట్టుకున్న లవ్ స్టోరీ దీవాన. యంగ్ స్టర్స్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా నటించిన ఈ మూవీని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి నిర్మించారు. ఈ ప్రేమకథకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒక మాములు లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి అడియన్స్ మైండ్ పోయింది. కథాంశం, డైరెక్షన్ సినీ ప్రియులను కట్టిపడేసింది. జూలై 31 నుంచి తెలుగు, తమిళం భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్..

కథ విషయానికి వస్తే.. డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటాడు మున్నా (హర్షిత్ రెడ్డి). ఇంట్లో పేరెంట్స్ మాటలు పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూనే ఉంటాడు. కానీ అమ్ము (స్నేహ మణిమేగలై )ను మొదటి చూపులోనే చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత తన ప్రేమ కోసం మున్నా ఏం చేశాడు అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

దివాానా ఓటీటీ డేట్..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *