నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ మస్త్ ఇష్టం. ఇక సండే వచ్చిందంటే చికెన్‌లో వెరైటీలు ఉండాల్సింది. అటు డాక్టర్లు సైతం చికెన్ ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. అయితే చికెన్ మొత్తాన్ని కళ్లు మూసుకుని తినడం అస్సలు మంచిది కాదు. నిపుణులు, పరిశోధనల ప్రకారం.. కోడి శరీరంలోని కొన్ని భాగాల్లో అధిక కొవ్వులు, ప్రమాదకరమైన బాక్టీరియా, అలాగే పెరిగిన వాతావరణం వల్ల చేరిన విష పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి. ఇలాంటి భాగాలను ఎక్కువగా తినడం వల్ల ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. ఇంతకీ చికెన్‌లో తినకూడని లేదా అత్యంత జాగ్రత్తగా వండుకోవాల్సిన ఆ భాగాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం
చికెన్ స్కిన్
క్రిస్పీగా ఉండే చికెన్ స్కిన్ చాలామందికి ఇష్టమైన పదార్థం. కానీ ఆరోగ్యపరంగా ఇది అత్యంత ప్రమాదకరం. స్కిన్‌లో అధిక భాగం అనవసర కొవ్వులే ఉంటాయి. దీనిని తరచుగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.
ఊపిరితిత్తులు
కోడి ఊపిరితిత్తుల్లో సూక్ష్మజీవులు, పరాన్నజీవులు ఉండే అవకాశం ఎక్కువ. ఎంత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండినా లేదా మరిగించినా ఇవి సులభంగా నశించవు. అందుకే ఈ భాగాన్ని తినకపోవడమే మంచిది.
కోడి తల
కొన్ని సంప్రదాయ వంటకాలు, సూప్‌లలో కోడి తలను ఉపయోగిస్తుంటారు. అయితే కోళ్లు తినే ఆహారం, పరిసరాల వల్ల నాటు పదార్థాలు మరియు క్రిమిసంహారకాల అవశేషాలు ఈ భాగంలో పేరుకుపోతాయి. దీన్ని దీర్ఘకాలంగా తింటే శరీరంలో విషపదార్థాలు చేరే ప్రమాదం ఉంది.
ప్రేగులు
కోడి ప్రేగుల్లో బాక్టీరియా, ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎంత శుభ్రం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో క్రిములు పోవు కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది.
కోడి కాళ్లు
కొన్ని సంప్రదాయ వంటకాల్లో చికెన్ ఫీట్ చాలా ఫేమస్. సరిగ్గా వండితే రుచిగా ఉన్నప్పటికీ, ఇవి నిరంతరం నేలను తొక్కుతుండటం వల్ల కాళ్ల మధ్య ఉండే గ్యాప్‌లలో మురికి, క్రిములు, బాక్టీరియా పేరుకుపోతాయి. వీటి ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువ.
గుండె
కోడి గుండెలో ప్రోటీన్, ఖనిజాలు ఉన్నప్పటికీ… కోడి అనుభవించే ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల అవశేషాలు ఇందులో నిల్వ ఉంటాయి. అందుకే దీన్ని పూర్తిగా మానకపోయినా, తినే పరిమాణాన్ని చాలా పరిమితంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
గిజార్డ్
గిజార్డ్ కోడి శరీరం లోపల ఆహారాన్ని అరిగించడానికి లేదా నమలడానికి సహాయపడుతుంది. దీంట్లో చిన్న చిన్న రాళ్లు, వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా, శుభ్రంగా కడగకపోతే ప్రమాదకర బాక్టీరియా కడుపులోకి వెళ్తుంది.
కోడి మెడ
కొంతమందికి చికెన్ నెక్ ఫెవరెట్. సూప్‌లు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇవి బాక్టీరియా వేగంగా పెరిగే స్థావరాలు. కేవలం ఉడకబెట్టడం వల్లనే ఇక్కడి బాక్టీరియా చనిపోదు. కాబట్టి మెడ భాగాన్ని బాగా శుభ్రం చేసి, చాలా సమయం పాటు ఎక్కువ వేడి మీద వండాల్సి ఉంటుంది.
వింగ్ టిప్స్
రెక్కల చివరల్లో కేవలం ఎముక, చర్మం తప్ప ఎలాంటి మాంసం లేదా పోషకాలు ఉండవు. కాబట్టి వీటిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
బోన్ మ్యారో
చికెన్ ఎముకలతో తయారుచేసే సూప్‌లు మంచి పోషకాలనిస్తాయి. కానీ ఎముక లోపల ఉండే మూలుగు భాగంలో ఒక్కోసారి రక్తం సరిగ్గా ఉడకకుండా ఉండిపోతుంది. ఎముకలను చాలాసేపు ఎక్కువ వేడి మీద ఉడకబెట్టకపోతే దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే స్వల్ప ప్రమాదం ఉంది.
చికెన్ వండుకునేటప్పుడు శుభ్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రమాదకర భాగాలను పక్కనపెట్టి, కేవలం సురక్షితమైన మాంసాన్ని మాత్రమే సరిగ్గా ఉడికించి తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.