Headlines

సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!

సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!


సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మైనర్లను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

మృతులను మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని స్థానికులు, పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులు కలిసి క్రికెట్ ఆడేందుకు బైక్‌పై బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపానికి చేరుకోగానే లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రరూపం దాల్చింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సెలవు రోజున సరదాగా క్రికెట్ ఆడేందుకు బయలుదేరిన ఇద్దరు యువకులు తిరిగి రాకపోవడం స్థానికులను కలచివేసింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *