భారీ బ్యాటరీలు, యాడ్స్ లేని క్లీన్ సాఫ్ట్వేర్, అనుభవం, ప్రత్యేక లాంచ్ ఆఫర్లతో ‘విరాట్ V1’ సిరీస్ స్మార్ట్ఫోన్లు రూపుదిద్దుకున్నాయి. జూలై 31న ఫ్లిప్‌కార్ట్ వేదికగా ప్రత్యేక ధరలకు అందుబాటులోకి రానున్న ఈ లావా విరాట్ V1 సిరీస్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!
లావా విరాట్ V1 5G విశేషాలు
దేశీయ బ్రాండ్ లావా ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ఈ సరికొత్త సిరీస్‌ను రూపొందించింది. ఇందులో ‘Lava Virat V1 5G’ మోడల్లో 6.75 అంగుళాల HD+ (720×1600 పిక్సెల్స్) డిస్ప్లేను అందించారు. ఇది స్మూత్ విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు UNISOC T8200 ప్రాసెసర్‌ను అనుసంధానించారు. ఇందులో 4GB RAMతో పాటు అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్ లభిస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
ఫోటోగ్రఫీ కోసం 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. రోజంతా నిరంతరం పనిచేసేలా 6000mAh భారీ బ్యాటరీ, 10W ఛార్జింగ్, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది.
లావా విరాట్ V1 (4G) ఫీచర్లు
బడ్జెట్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన ‘Lava Virat V1’ మోడల్లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. దీనికి UNISOC SC9863A ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో కూడా 4GB RAM, 64GB స్టోరేజ్, 1TB వరకు మైక్రోSD సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌పై పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ రెండు మోడళ్లలోనూ ఎలాంటి ప్రకటనలు (Ads) లేదా అవాంఛిత యాప్‌లు (Bloatware) ఉండవని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో 13MP డ్యూయల్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, IP64 రేటింగ్ అందించారు.
సేల్ వివరాలు
ఈ స్మార్ట్ఫోన్ల ధరలు, కలర్ ఆప్షన్లు ఇలా ఉన్నాయి.
- Lava Virat V1 5G: ఆర్య బ్లూ, సోనార్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. దీని సాధారణ ధర రూ. 12,999 కాగా, ప్రత్యేక లాంచ్ ఆఫర్లో రూ. 11,999కే దక్కుతుంది.
- Lava Virat V1: నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. దీని సాధారణ ధర రూ. 9,999 కాగా, లాంచ్ ఆఫర్ కింద రూ. 8,999కే లభించనుంది.
ఈ ప్రత్యేక ధరలు జూలై 31న మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, లావా అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు ఇవి అందుబాటులో ఉంటాయి. అదనంగా ‘Free Service@Home’ సేవను కూడా కంపెనీ అందిస్తోంది. తక్కువ బడ్జెట్లో క్లీన్ సాఫ్ట్వేర్, భారీ బ్యాటరీ, మంచి ఫీచర్లు కోరుకునే వారికి లావా విరాట్ V1 సిరీస్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది