Headlines

Bigg Boss 10 Telugu: బిగ్‏బాస్‏లోకి గోదావరి అమ్మాయి.. ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్ది.. క్లారిటీ ఇచ్చిన స్రవంతి పేపకాయల..

Bigg Boss 10 Telugu: బిగ్‏బాస్‏లోకి గోదావరి అమ్మాయి.. ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్ది.. క్లారిటీ ఇచ్చిన స్రవంతి పేపకాయల..


సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్నవారిలో స్రవంతి పేపకాయల ఒకరు. గోదావరి అమ్మాయి అంటూ తన రీల్స్, వీడియోస్ ద్వారా నెట్టింట ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. అటు వెబ్ సిరీస్, సినిమాల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది. అలాగే పలు టీవీ, ఓటీటీ షోలలో పాల్గొని తన మాటలతో, కామెడీ టైమింగ్ తో మరింత పాపులర్ అయ్యింది. తాజాగా స్రవంతి పేపకాయల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్, పర్సనల్ విషయాల గురించి పంచుకుంది. తన జర్నీ, సినిమా అవకాశాలు, కంటెంట్ క్రియేషన్, బిగ్ బాస్ రియాల్టీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

సదరు ఇంటర్వ్యూలో మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా అని అడగ్గా.. “లేదండి.. ఆ బిగ్ బాస్ టైంలో నాకు వేరే షూటింగ్ ఉందండి. ఒకవేళ మధ్యలో ఏమైనా పిలిస్తే ఒక రోజు వెళ్తాను. నాకు ఆఫర్ వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని.. కానీ ప్రస్తుతం తాను సినిమాలు, వెబ్ సిరీస్ పై దృష్టిపెట్టినట్లు తెలిపింది.

స్రవంతి పెపకాయల.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్వతంత్రంగా వినోదాత్మక రీల్స్ , షార్ట్స్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తన రీల్స్ ,వీడియోలలో ఆంటీ, పనిమనిషి, వార్డెన్ వంటి వివిధ రకాల హాస్యభరిత క్యారెక్టర్లను పోషించి నెటిజన్లను విశేషంగా అలరించారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

స్రవంతి పేపకాయల..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *