Headlines

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..


రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా తోడరాయిసింగ్ పట్టణంలో సోమవారం ఉదయం ఒక చిరుతపులి బీభత్సం సృష్టించింది. అడవి నుంచి దారితప్పి పట్టణంలోకి ప్రవేశించిన ఈ చిరుత, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో సంచరిస్తూ ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఉదయం పొదల్లో దాగివున్న చిరుతను గమనించి పరిశీలించడానికి వెళ్లిన అటవీ శాఖ వాలంటీర్ రాకేష్ మాలిపై అది మొదట దాడి చేసింది. అనంతరం మార్కెట్‌లోకి పరుగులు తీసి, స్థానికుడు ఫతే లాల్ కోలిపై, ఆ తర్వాత ఒక మద్యం దుకాణంలో పనిచేసే సేల్స్‌మెన్ సంజయ్ గుర్జార్‌పై విరుచుకుపడింది. తీవ్ర గాయాలైనప్పటికీ సంజయ్ చాకచక్యంగా బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం చిరుతపులి వైన్ షాప్‌లో తిష్టవేసుకొని కూర్చుంది. అదే అదనుగా స్థానిక ప్రజలు, వెంటనే బయటి నుంచి షట్టర్‌ను దించి మూసివేశారు. దీంతో ఆ చిరుత లోపలే ఉండిపోవడంతో ఇంకెవరిపైనా దాడి చేయకుండా పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న టోంక్ అటవీశాఖ అధికారులు, జైపూర్ జూ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం దాదాపు 5 గంటల పాటు శ్రమించి చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఒక మద్యం దుకాణం లోపల నుంచి చిరుతను పట్టుకోవడం ఇదే తొలిసారని సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అశోక్ తన్వర్ వెల్లడించారు. తమ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో చిరుతల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లే ఇది దారితప్పి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!

Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్‌లో పట్టాలెక్కనున్న ట్రైన్‌

బ్రాండ్‌ Vs జనరిక్‌ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?

Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *