Headlines

Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్‌లో పట్టాలెక్కనున్న ట్రైన్‌

Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్‌లో పట్టాలెక్కనున్న ట్రైన్‌


భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తూ వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇప్పటివరకు కూర్చుని ప్రయాణించే వందేభారత్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే సుదూర ప్రయాణాల కోసం స్లీపర్ వెర్షన్‌లు రానున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో రాబోయే దసరా పండుగ నాటికి ఈ ఆధునిక స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాలకు సాధారణ వందేభారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా రానున్న స్లీపర్ రైళ్లలో ప్రయాణికులకు విమానంలో ప్రయాణించిన అనుభూతి కలిగేలా అత్యాధునిక సౌకర్యాలను రూపకల్పన చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్‌ ఏసీ బోగీల్లో లగ్జరీ ఇంటీరియర్స్, ఎల్‌ఈడీ లైటింగ్, వైఫై, సౌండ్‌ ప్రూఫ్ వ్యవస్థ, ఆటోమేటిక్ తలుపులు, ఛార్జింగ్ పాయింట్లు మరియు ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ వందేభారత్‌ స్లీపర్‌ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి సమయం ఆదా అవ్వడమే కాకుండా అత్యంత సుఖవంతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రాండ్‌ Vs జనరిక్‌ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?

Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

Chennai Love Story: హిట్టా..? ఫట్టా..? కిరణ్‌ అబ్బవరం ఖాతాలో హిట్‌ పడిందా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *