Headlines

EPFO: మీ పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయిందా..? ఇలా చేస్తే బ్యాలెన్స్ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు..

EPFO: మీ పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయిందా..? ఇలా చేస్తే బ్యాలెన్స్ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు..


ఉద్యోగం మానేశాక చాలామంది పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు. ఖాతాల్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేసుకున్న తర్వాత దాని గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇక కంపెనీకి మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోలేరు. దీంతో పాటు యూఏఎన్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోకుండా అలాగే ఉండిపోతారు. అయితే మీరు ఎక్కువకాలం పాటు పీఎఫ్ అకౌంట్ వాడకపోతే అది ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇన్ఆపరేటిగ్‌గా మారితే మీ అకౌంట్లోని డబ్బు అలాగే ఉండిపోతుంది. మళ్లీ మీరు కేవైసీ ప్రక్రియలు పూర్తి చేసి యాక్టివ్ చేసుకుంటేనే ఖాతా పనిచేస్తుంది. అయితే అకౌంట్ ఇనాక్టివ్ అయితే మీ అకౌంట్లోని డబ్బులు క్లెయిమ్ చేసుకోరు. మళ్లీ యాక్టివ్ చేసుకుంటేనే క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇలాంటి ఇన్ఆపరేటివ్ ఖాతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఇన్ఆపరేటివ్ ఖాతాల్లో మార్చి 31, 2026 నాటికి రూ.9330.56 కోట్ల సొమ్ము క్లెయియ్ చేసుకోకుండా ఉన్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. ఈ డబ్బులను ఖాతాదారులు తిరిగి యాక్టివేట్ చేసుకుని డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం నిధి ఆప్కే నికత్ 2.0 శిబిరాలను నిర్వహిస్తోంది. అయితే ఇన్‌ఆపరేటివ్ ఖాతాల్లో ఉన్న సొమ్మును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాలు చూద్దాం.

పీఎఫ్ సొమ్ము ఎలా క్లెయిమ్ చేసుకోవాలి..?

మీ పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్లోని సొమ్మును ప్రస్తుత కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా దీనిని చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు సందర్శించి ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న అనంతరం మీరు ఖాతాలోని సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ అయినవారు ఒకేసారి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ముందుగా పీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో.. లేదో చూసుకోండి. అనంతరం కొత్త కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇక అన్ని కంపెనీల పీఎఫ్ అకౌంట్లు యూఏఎన్‌తో లింక్ అయి ఉన్నాయా.. లేద అనేది చెక్ చేసుకోండి.

అకౌంట్ ఇనాక్టివ్‌గా ఎప్పుడు మారుతుంది..?

యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోతే అకౌంట్ ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది. యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకపోతే ఇనాక్టివ్ అయ్యే అవకాశముందని కేంద్రం చెబుతోంది. పీఎఫ్ క్లెయిమ్స్ చేయకపోవడం, కేవైసీ అప్డేట్ చేయకపోవడం లాంటి వాటి వల్ల అకౌంట్ ఇనాక్టివ్ అయ్యే అవకాశముంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *