Headlines

Ranveer Singh: ధురంధర్‌ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న రణవీర్‌

Ranveer Singh: ధురంధర్‌ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న రణవీర్‌


బాలీవుడ్‌లో ఇప్పుడు సౌత్ బ్యూటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ భామల కోసం మన సౌత్ మేకర్స్ క్యూ కడితే.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ మన హీరోయిన్ల వైపు చూస్తున్నారు. ధురంధర్‌ స్టార్ రణవీర్ సింగ్ అయితే సౌత్ బ్యూటీస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రణవీర్ సరసన నటించి రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు..? వాళ్ల ట్రాక్ రికార్డ్ ఏంటి..?భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో రణవీర్‌కు జోడీగా, సౌత్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన సారా అర్జున్ నటించారు. నాన్న, పొన్నియిన్ సెల్వన్‌ లాంటి సినిమాల్లో యాక్టింగ్‌తో సౌత్ ఆడియన్స్‌ను మెప్పించిన సారా.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్‌కే హీరోయిన్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ అప్‌ కమింగ్ లిస్ట్‌లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ప్రళయ్’లో కూడా సౌత్ బ్యూటీనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. జై మెహతా దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్‌లో కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘లోకా’ సినిమాతో 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ భామను, తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ప్రళయ్ సినిమా కోసం రణవీర్ స్వయంగా ఫోన్ చేసి మరీ ఒప్పించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ ప్రళయ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్, త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌ను కేవలం రొమాంటిక్ సీన్లకే పరిమితం చేయకుండా.. ఓ రేంజ్ యాక్షన్ రోల్ కోసం సెలెక్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ తో ఆమెకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *