Abhishek Sharma Records: జింబాబ్వేతో ప్రారంభమైన టీ20 సమరంలో భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైపు అందరి చూపులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఈ అటాకింగ్ బ్యాటర్, హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో తన బ్యాట్‌కు పనిచెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 15 పరుగులు చేస్తే చాలు, టీ20 ఫార్మాట్లో ఏకంగా 6,000 పరుగుల అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.
విరాట్ కోహ్లీ దిగ్గజ క్లబ్‌లోకి ఎంట్రీ..: ఒకవేళ అభిషేక్ శర్మ ఈ 15 పరుగులను రాబడితే, టీ20ల్లో 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 6,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మాత్రమే ఈ మైలురాయిని వేగంగా చేరుకున్నారు.
ప్రస్తుతం 204 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్, 200 ఇన్నింగ్స్‌లలో 5,984 పరుగులు సాధించి సిద్ధంగా ఉన్నాడు. కాగా, తొలి టీ20లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో రెండో మ్యాచ్‌లోనైనా ఈ రికార్డ్ సాధిస్తాడేమో చూడాలి.
ఫాస్టెస్ట్ రికార్డుల జాబితాలో టాప్ బ్యాటర్లు వీరే..: భారత్ తరఫున అత్యంత వేగంగా 6,000 టీ20 పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. అతడు కేవలం 166 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ (184 ఇన్నింగ్స్‌లు), శుభ్‌మన్ గిల్ (185 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ కేవలం 162 ఇన్నింగ్స్‌లలోనే 6,000 పరుగులు సాధించి ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
జింబాబ్వేపై తిరుగులేని రికార్డు ఉన్న అభిషేక్..: జింబాబ్వే జట్టుపై అభిషేక్ శర్మకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన 7 టీ20 మ్యాచ్‌లలో 180 పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. హరారే మైదానంలో తన సుపరిచితమైన విరుచుకుపడే వైఖరితో ఆడితే ఈ రికార్డును అందుకోవడం చాలా సులభమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న అద్భుతమైన ఫామ్‌ను బట్టి చూస్తే అభిషేక్ శర్మ అతి త్వరలోనే ఈ ఘనతను సాధించి దిగ్గజాల సరసన చేరుతాడని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. భారత క్రికెట్లో తన అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ మున్ముందు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.





